మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చిగుళ్లు, దంత ఆరోగ్యం దెబ్బతింటుంది. నోటి
నుంచి దుర్వాసన వస్తుంది.
లవంగం నూనె:
లవంగం నూనె నోటిని ఆరోగ్యంగా మార్చుతుంది. లవంగం నూనె పంటి నొప్పిని
తగ్గిస్తుంది. నోటి దుర్వాసన సమస్యలను ఈ నూనె దూరం చేస్తుంది. లవంగం నూనె
నోటిలోని బ్యాక్టీరియాను తొలగిస్తుంది. గొంతు ఇన్ఫెక్షన్ ను దూరం చేస్తుంది.
థైమ్:
పుదీనా కుటుంబానికి చెందిన థైమ్ నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది తాజా
వాసనను అందించడంలో సహాయపడుతుంది. చిగుళ్ల వాపు, దంతక్షయం నుంచి థైమ్ ఉపశమనం
అందిస్తుంది. నోటి దుర్వాసన సమస్య తొలగుతుంది.
ఒరేగానో ఆయిల్:
ఒరేగానోలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఒరేగానో
ఆయిల్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చిగుళ్ల వాపు సమస్యను దూరం చేస్తుంది.
ఆయిల్ పుల్లింగ్ కోసం కొబ్బరినూనెతో కలిపి వినియోగించవచ్చు.
టీట్రీ ఆయిల్:
టీట్రీ ఆయిల్ ను ఉపయోగించడంతో దంతాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యంగా మారుతాయి. ఈ
ఆయిల్ లో బ్యాక్టీరియాను తొలగించే గుణాలు దంతక్షయాన్ని తగ్గిస్తుంది. టూత్
పేస్ట్ తోకలిసి ఈ టీట్రీ ఆయిల్ ఉపయోగించడంతో మంచి ఫలితాలు పొందవచ్చు.
దాల్చిన చెక్క:
దాల్చిన చెక్కలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి
దంతాలను ఆరోగ్యంగా మార్చుతాయి. దాల్చినచెక్క నూనె దంత క్షయానికి కారణమయ్యే
బ్యాక్టీరియాను సులభంగా తొలగిస్తుంది.
పిప్పర్ మెంట్ ఆయిల్:
పిప్పర్ మెంట్ ఆయిల్ దంతాల నొప్పిని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. పిప్పరమెంటు
నూనెలోని లక్షణాలు వ్యాధికారక క్రిములతో పోరాడతాయి. ఇది చిగుళ్లను ఆరోగ్యంగా
మార్చుతాయి.
రెండు సార్లు బ్రష్:
ఈ టిప్స్ ఫాలో అవుతూ ప్రతి రోజూ రెండు సార్లు బ్రష్ చేయాలి. సరైన పోషకాహారం
తీసుకోవడం, స్వీట్స్ తినడాన్ని తగ్గించడం, కార్బోనేటెడ్ డ్రింక్స్ కు దూరంగా
ఉండటంతో ఆరోగ్యంగా ఉండవచ్చు.