పేదవాడికి ఇంతకంటే మంచి ప్రభుత్వం దొరుకుతుందా..!!
ఇలాంటి ప్రభుత్వాన్ని, సమర్థవంతమైన నాయకుడిని మనందరం కాపాడుకోవాలి
ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మళ్లీ జగనన్న ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలి
ఈసారి రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై వేయాలి
సారవకోట మండలం కొమ్ము సిరియాపల్లి, వాండ్రాయి , కరడసింగి, కూర్మనాధపురం పంచాయతీల్లో వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణ దాస్ మమ్మరంగా ప్రచారం
సారవకోట , బ్యూరో ప్రతినిధి: అనునిత్యం పేదవాడి బాగోగుల కోసం.. పేద బతుకులు మారడం కోసం, పేదలకు మేలు చేయడం కోసం ఆలోచిస్తున్నా ఇంత మంచి ముఖ్యమంత్రిని దేశంలోనే ఎక్కడ ఎవరు చూసి ఉండరని, ఇలాంటి సమర్థవంతమైన ముఖ్యమంత్రిని ప్రజలందరూ కాపాడుకోవాలని, మళ్లీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగనన్న కు మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలని మాజీ డిప్యూటీ సీఎం జిల్లా పార్టీ అధ్యక్షులు నరసన్నపేట నియోజకవర్గం సిటింగ్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణ దాస్ పేర్కొన్నారు. శుక్రవారం సారవకోట మండలం కొమ్ము సరియాపల్లి వాండ్రాయి, కరడసింగి , కూర్మనాధపురం పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలందరూ ఒక్కసారి విజ్ఞతతో ఆలోచించాలని, గత 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పాలనా కాలంలో పేద ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదన్నారు. కనీసం చెప్పుకోవడానికి ఒక మంచి పథకమైన లేదన్నారు. అలాంటిది ఐదేళ్ల పాలనా కాలంలో ప్రజలందరికీ నవరత్నాలు అందించడమే కాకుండా.. మేనిఫెస్టో హామీలను 99% నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. చంద్రబాబు నాయుడు కూటమితో వచ్చిన… దొంగ మేనిఫెస్టో వచ్చినా.. అబద్ధపు హామీలతో వచ్చినా సరే… ఎన్నికల్లో విజయం సాధించేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని… మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్ రెడ్డేనని స్పష్టం చేశారు. ప్రతి కుటుంబానికి మేలు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలందరూ మద్దతు పలకాలని,ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వరుడు వంశీకృష్ణ, వరుదు దేవీప్రసాద్, వైసిపి నాయకులు చెన్నాల లక్ష్మీనారాయణ నాయుడు, పిఎసిఎస్ అధ్యక్షులు గెల్లంకి వెంకట్రావు, జేసి ఎస్ కన్వీనర్ నక్క తులసీదాస్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బొంగు కొండయ్య, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పల్లి కృష్ణయ్య, బాణాన కృష్ణారావు, వెలమల సింహాచలం, గొర్లె ఢిల్లీ రావు, గద్దిబోయిన గోవింద రావు, కొండాల బాబురావు, మెండ రామకృష్ణ , పారశెల్లి తేజేశ్వరరావు, చెంచెల సింహాచలం , సూరపు కేటేశ్వరరావు,స్థానిక నాయకులు పోలాకి కేశవరావు, సూరపు రమేష్, పోలాకి చంద్రరావు,కూన బీమారావు, రోణంకి ప్రభావతి, శ్రావణ్, రవి, మామిడి కాంతారావు పాల్గొన్నారు.