విశాఖపట్నం : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటన షెడ్యూల్ ఖరారైంది.
ఈనెల ఉమ్మడి విశాఖలో చంద్రబాబు పర్యటించనున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర
ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న తెలిపారు. ఈనెల 17,18,19 తేదీల్లో
పెందుర్తి, ఎస్.కోట, అనకాపల్లి నియోజకవర్గాల్లో “ఇదేం ఖర్మ-మన రాష్ట్రానికి”
కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. జగన్మోహన్ రెడ్డి అక్రమాలపై ఉత్తరాంధ్ర నుంచే
తిరుగుబాటు మొదలవ్వాలని అన్నారు. ముఖ్యమంత్రిది దరిద్రగొట్టు పాదం అని, ఎక్కడ
అడుగు పెడితే అక్కడే అరిస్టమే అంటూ విమర్శలు గుప్పించారు. పంటకు చీడపడితే ఎంత
నష్టం జరుగుతుందో రాష్ట్రం ఇప్పుడు అదే స్థితికి వచ్చిందన్నారు. ఆయన అడుగు
పెట్టిన వెంటనే కరోనా మహమ్మారి వచ్చిందని,. కాలాలు కూడా గతి తప్పి వ్యతిరేకంగా
పని చేస్తున్నాయని ఆయన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో అడుగు పెట్టారు..విజయవాడ,
గుంటూరు నాశనం అయ్యాయన్నారు. సెప్టెంబర్ నుంచి సీఎం వైజాగ్లో కాపురం పెడితే
నాశనమే. ఈ ముఖ్యమంత్రిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల్లో పొత్తుపై చంద్రబాబు తుది నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు.
సీఎం వస్తోంది విశాఖ నుంచి ఇచ్చాపురం వరకు భూ ఆక్రమణల కోసమే అని అన్నారు.
విజయవాడను పెద్ద పల్లెటూరుగా మార్చేశారని మండిపడ్డారు. డీఎస్పీల నియామకాల్లో
రాజకీయ జోక్యం వెనుక మాఫియా ఆలోచనలు ఉన్నాయని ఆరోపించారు. రైతుల సమస్యలపై
ప్రతిపక్ష నాయకుడు రోడ్లపై తిరుగుతుంటే సీఎం ఎందుకు స్పందించరని ప్రశ్నించారు.
కాంగ్రెస్లో ఓ వెలుగు వెలిగిన సీనియర్ మంత్రి బాధ వర్ణనాతీతంగా ఉందని బుద్దా
వెంకన్న పేర్కొన్నారు.