పంపించేందుకు ముమ్మరంగా ప్రభుత్వం సన్నాహాలు
స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటుకు అంగీకరించిన సివిల్ ఏవియేషన్ శాఖ
అమరావతి : మణిపూర్లో అల్లర్లు కారణంగా చిక్కుకుపోయిన తెలుగు విద్యార్ధులను
సురక్షితంగా వారి స్వస్ధలాలకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు
ముమ్మరం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటోంది.
ఇప్పటివరకు దాదాపు 100 మంది ఏపీ విద్యార్ధులు మణిపూర్లో చదువుతున్నట్టు
గుర్తించారు. వీరిని ప్రత్యేక విమానంలో తరలించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు
చేస్తుంది. ఈ మేరకు పౌరవిమానయానశాఖ అధికారులతో మాట్లాడుతున్నారు. వ్రత్యేక
విమానం ద్వారా ఏపీ విద్యార్ధులను తరలించడానికి పౌరవిమానయానశాఖ అంగీకరించింది.
ఈ మేరకు ప్రత్యేక విమానాన్ని ఎన్నిగంటలకు ఏర్పాటు చేస్తామన్న సమాచారంతో పాటు ఏ
విమానంలో తరలిస్తామన్నది తెలియజేస్తామని పౌరవిమానయానశాఖ అధికారులు తెలిపారు.