ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మద్దతు పలకండి
వైసీపీ అభ్యర్థి, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్
సోమవారం సారవకోట మండలంలోని బైదలాపురం బద్రి లక్ష్మీపురం పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం
సారవకోట బ్యూరో ప్రతినిధి : రానున్న ఎన్నికలు పేదవారికి, పెత్తందారులకు మధ్యన జరుగుతున్న ఎన్నికలని, పేదలంతా పక్షాన నిలబడి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని నరసన్నపేట నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి, మాజీ డిప్యూటీ సీఎం, జిల్లా పార్టీ అధ్యక్షులు, నరసన్నపేట సిట్టింగ్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ కోరారు. సోమవారం సారవకోట మండలంలోని బైదలాపురం, బద్రి, లక్ష్మీపురం (బుడితి) పంచాయతీల్లో మేమంతా సిద్ధం ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ను మళ్లీ గెలిపించాలని, ఇలాంటి సమర్థవంతమైన ముఖ్యమంత్రిని ప్రజలందరూ కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో స్వర్ణ యుగం లాంటి సంక్షేమ అభివృద్ధి పాలనను అందించిన ముఖ్యమంత్రిని ప్రజలందరూ మద్దతుగా నిలవాలని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మళ్లీ గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే యువ నాయకులు ధర్మాన రామలింగం నాయుడు కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టినప్పుడు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఇంటింటా కుంకుమ తిలకాలు ఘన స్వాగతం పలికారు. అలాగే ఉపాధి హామీల వద్దకు వెళ్లి ప్రచారం చేపట్టగా ఉపాధి కూలీలు దాసన్నకు జేజేలు పలికారు. మళ్లీ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తామని.. చేయి ఎత్తి జై కొట్టారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వరుదు వంశీకృష్ణ, వరుదు దేవీప్రసాద్, జేసీఎస్ కన్వీనర్ నక్క తులసీదాస్ పిఎసిఎస్ అధ్యక్షులు గెల్లంకి వెంకట్రావు మార్కెట్ కమిటీ చైర్మన్ పెరుమాళ్ల తవిటినాయుడు, వైస్ ఎంపీపీ గుణుపురం రామారావు, పల్లి కృష్ణయ్య, బాడాన క్రిష్ణారావు, నిక్కు రాజశేఖర్ మాస్టారు సర్పంచులు ఎంపీటీసీలు అరియాపల్లి రాము, చెంచెల సింహాచలం, వెలమల సింహాచలం రావాడ భాస్కరరావు స్థానిక సర్పంచ్ మజ్జి అప్పన్న, మెండ బాలచందర్ నాయుడు, గద్దిబోయిన గోవిందరావు, మెండ సుందరరావు, కొండాల బాబురావు, మెండ సూర్యనారాయణ, కత్తరి మోహన్ దాస్, మెండ రామకృష్ణ, పోలాకి కేశవరావు, పారశెల్లి తేజేశ్వరరావు, పోన్నాన ప్రసాద్, కోరుకొండ శంకర్రావు, రాజు డాక్టర్ , తదితరులు పాల్గొన్నారు.