కూడా నొప్పి తగ్గదు. అయితే ఇలా దీర్ఘకాలికంగా మెడిసిన్ ఉపయోగించే బదులు కొన్ని
యోగాసనాలు ప్రాక్టీస్ చేయడం ద్వారా తలనొప్పి తగ్గించుకోవచ్చు. అవేంటో చూద్దాం..
అర్ధపించ మయూరాసనం:
బాడీ స్ట్రెచ్ కావడానికి ఈ ఆసనం సహాయపడి మిమ్మల్ని ప్రశాంతంగా మారుస్తుంది.
అలాగే మెదడుకు రక్త ప్రసరణ, ఆక్సిజన్ సరఫరా మెరుగ్గా జరిగేలా చేస్తుంది.
తద్వారా తలనొప్పిని నివారిస్తుంది.
సుప్త విరాసనం:
బాడీ బ్యాలెన్స్ కాపాడటంలో ఈ ఆసనం సహాయపడుతుంది.అలాగే ఆందోళన, తలనొప్పి వంటి
సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
పాదంగుస్తాసనం:
మెదడుకు రక్త ప్రసరణ మెరుగుపర్చడంలో ఈ ఆసనం సహాయపడుతుంది. దీనివల్ల మెదడుకు
కావాల్సిన ఆక్సిజన్ అందుతుంది. తద్వారా తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
బాలాసనం:
తలకు రక్త ప్రసరణ మెరుగ్గా జరిగేలా చేయడంలో బాలాసనం సహాయపడుతుంది. అలాగే
ఒత్తిడి, ఆందోళన వల్ల కలిగే తలనొప్పిని నివారిస్తుంది.
సేతు బంధాసనం
ఇది మిమ్మల్ని రిలాక్స్ చేయడమే కాకుండా ఏకాగ్రత పెరిగేలా చేస్తుంది. ఒత్తిడి,
ఆందోళన వంటి సమస్యలు తగ్గి తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
మార్జారియాసనం:
శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా జరిగేలా చేయడంలో మార్జారియాసనం సహాయపడుతుంది.
తద్వారా ఒత్తిడి, ఆందోళన తగ్గించి తలనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
పశ్చిమోత్తనాసనం
తలనొప్పి, ఒత్తిడి వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారికి పశ్చిమోత్తనాసనం
ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే ఆందోళనను కూడా నివారిస్తుంది.
శవాసనం:
యోగా సెషన్ పూర్తయ్యాక ఈ శవాసనం వేస్తారు. ఇది కండరాలను, బాడీని రిలాక్స్
చేస్తుంది. అలాగే తలనొప్పి వంటి సమస్యలను నివారిస్తుంది.