రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా
అమరావతి బ్యూరో ప్రతినిధి : రాష్ట్రవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం బోరకమందలో టీడీపీకి చెందిన ముగ్గురు ఏజెంట్లు కిడ్నాప్ అయినట్లు వచ్చిన ఆరోపణపై జిల్లా ఎన్నికల యంత్రాంగం తో పాటు పోలీసుల యంత్రాంగం వెంటనే స్పందించడం జరిగిందని రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. కిడ్నాపైన టీడీపీ ఏజెంట్లను పోలీసులు పీలేరులో గుర్తించి, వారిని వెంటనే విధులకు హాజరపరచడమైందన్నారు. సదుం మం. బోరకమందలో 188, 189,199 కేంద్రాల టీడీపీ ఏజెంట్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్న సమయంలో వైసీపీ నాయకులు కిడ్నాప్ చేశారని టీడీపీ జిల్లా ఇన్ ఛార్జి జగన్ మోహన్ రాజు చేసిన ఫిర్యాదు పై పోలీసులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అసలు వారిని ఎవరు కిడ్నాప్ చేశారనే అంశాన్ని పోలీసులు దర్యాప్తు చేయడం జరుగుచున్నదని, దర్యాప్తు అనంతరం నిజానిజాలు తెలుస్తాయని ఆయన తెలిపారు.