మంత్రి కేటీఆర్ అభినందనలు
హైదరాబాద్ : భారత్ ఆర్థికంగా వృద్ధి చెందుతోందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
పేర్కొన్నారు. మంచి ఆలోచన ఉన్న స్టార్టప్‌లకు నిధులు ఇబ్బంది కాదని తెలిపారు.
హైదరాబాద్‌లో సుమారు 6,000 స్టార్టప్‌లు ఉన్నాయని వివరించారు. భారత్‌లో మొదటి
ప్రైవేట్ రాకెట్ టీహబ్ నుంచే వచ్చిందని ఆయన గుర్తు చేశారు.
డల్లాస్ వెంచర్ క్యాపిటల్‌లో టీ హబ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇండియా ఫండ్
పేరుతో టీ హబ్‌కి డల్లాస్ వెంచర్ క్యాపిటల్ డబ్బులు ఇవ్వనుంది. టీ
హబ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ
సందర్భంగా డల్లాస్ వెంచర్ సంస్థకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. అనంతరం
కేటీఆర్ మాట్లాడుతూ డల్లాస్ వెంచర్ సంస్థ భారత్‌లో అనేక స్టార్టప్స్
నెలకొల్పిందని చెప్పారు. భారత్‌లో ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన గొప్పదని
కేటీఆర్ కొనియాడారు. హైదరాబాద్‌లో సుమారు 6 వేల స్టారప్లు ఉన్నాయి. భారత్
ఆర్థికంగా వృద్ధి చెందుతుందన్నారు. భారత్‌కు పెట్టుబడులు రాబట్టడం కష్టం
కాదన్నారు. మంచి ఆలోచన ఉన్న స్టార్టప్‌లకు నిధులు ఇబ్బంది కాదన్నారు.
భారత్‌లో మొదటి ప్రైవేటు రాకెట్ టీ హబ్ నుంచే వచ్చిందని కేటీఆర్ గుర్తు
చేశారు.