దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భారత దేశ వ్యాప్తంగా క్యాన్సర్
వ్యాధి, దాని నివారణ లాంటి పలు అంశాలపై వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ
సందర్భాన్ని పురస్కరించుకొని హైదరాబాదు బంజారా హిల్స్ లోని విరించి
హాస్పిటల్స్ లో విరించి కార్కినోస్ క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో 7, 8 నవంబర్
లలో రెండు రోజుల పాటూ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని
నిర్వహిస్తున్నారు. విరించి కార్కినోస్ క్యాన్సర్ సెంటర్ ను విరించి
హాస్పిటల్స్, హైదరాబాదు, భారత దేశంలో క్యాన్సర్ చికిత్సలోనే పేరెన్నిక గలిగిన
కార్కినోస్ హెల్త్ కేర్ వారు సంయుక్తంగా ఏర్పాటు చేశారు.
ఈ ఉచిత క్యాన్సర్ వ్యాధి నిర్థారణ శిబిరంలో పలు రకములైన రక్త పరీక్షలతో పాటూ
అవసరమైన వారికి ఎక్స్ రే, హెచ్ పీవీ వైరస్ స్క్రీనింగ్ లాంటి పరీక్షలు
ఉచితంగా నిర్వహిస్తారు. అనంతరం క్యాన్సర్ వైద్య నిపుణునితో కన్సల్టేషన్ కూడా
ఉంటుంది. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సందర్భంగా డా. పొడూరి నారాయణ
మూర్తి, రేడియేషన్ ఆంకాలజిస్టు, విరించి కార్కినోస్ క్యాన్సర్ సెంటర్ కు
చెందిన క్యాన్సర్ వైద్య నిపుణులు మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిని ఎంత త్వరగా
గుర్తించి వ్యాధి తీవ్రం కాని దశలలోనే చికిత్స అందించగలిగితే దానిని పూర్తిగా
నయం చేయవచ్చన్నారు. అయితే క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన సంకేతాలను
గుర్తించడంలో ప్రజలలో సరైన అవగాహన లేకపోవడంతో వారు వ్యాధి ముదిరిన తర్వాత
చికిత్సకు వస్తూ ప్రాణాంతక పరస్థితిని కొని తెచ్చుకొంటున్నారని ఆవేదన వ్యక్తం
చేశారు. ఈ పరిస్థితిని దేశంలో చక్కదిద్దాలంటే క్యాన్సర్ వ్యాధి వచ్చిన తర్వాత
పొడచూపే పలు సంకేతాలను వెంటనే గుర్తించగలగడంపై అవగాహన కలిపించడం ఎంతో అవసరమని
భారత దేశమంతా 7 నవంబర్ నాడు ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని
చెప్పారు.
అనంతరం డా. శ్రీనివాస్ సామవేదం, మెడికల్ డైరెక్టర్, విరించి హాస్పిటల్స్ వారు
మాట్లాడుతూ మనిషి శరీరంలో ఎక్కడైనా అసంబద్దమైన రక్తస్రావం, ఎంతకీ తగ్గని,
పుండు, మూల మూత్ర విసర్జనా పద్దతులలో మార్పులు ఏర్పడడం, మహళలలో రొమ్ము లేదా
మనుష్యులలోని ఏ శరీరం భాగంలో నైనా గడ్డ, ఎంతకీ తగ్గని దగ్గు, పుట్టుమచ్చలలో
మార్పులు రావడం, గొంతు ద్వారా సరైన రీతిలో మింగలేకపోవడం వంటి లక్షణాలు
కనిపిస్తే అది క్యాన్సర్ వ్యాధికి సంకేతాలుగా భావించి వైద్య నిపుణులను
సంప్రదించాలని సూచించారు. అంతే గానీ స్వంత వైద్యం చేసుకోవడం లాంటివి చేసుకొని
ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రమాదం తప్పదని ఆయన హెచ్చరించారు.
ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ ఉచిత క్యాన్సర్ నిర్థఆరణ శిబిరంలో యాభైకి పైగా
రోగులను వైద్యులు పరీక్షించారు. ఈ కార్యక్రమంలో డా. పొడూరి నారాయణ మూర్తి,
రేడియేషన్ ఆంకాలజిస్టు, విరించి కార్కినోస్ క్యాన్సర్ సెంటర్ తో పాటూ ఇతర
వైద్యులు, నర్సింగ్ మరియు పారా మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఉచిత
క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు లో పాల్గొనదలచిన వారు మంగళ వారం ఉదయం
10గంటలకు హాస్పిటల్ కు చేరుకోవాలని డా. శ్యాం సుందర్, డైరెక్టర్, విరించి
హాస్పిటల్స్ వారు తెలిపారు. ఈ సదుపాయాన్ని పెద్ద సంఖ్యలో ప్రజలు
వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.