పుసుపు పతి ఐదేళ్ల తర్వాత లేచి వచ్చి వదల బోమ్మాళి వదల అంటూ పేదల రక్తం పీల్చేందుకు వస్తున్నాడు, కూర్చి కోసం ఈ పుసుపు పతి నోటకి వచ్చిన అబద్ధాలు చెబుతాడు
జగన్ ను నేరుగా దాడి చేయలేక అవ్వతాతలను ఇబ్బంది పెడుతున్నారు.. పెత్తందారి భావజాలన్ని మరోసారి నిరూపించుకున్నారు- సీఎం జగన్
జగన్ మేమంతా సిద్ధం యాత్రకు జనం నీరాజనం పలుకుతున్నారు. యాత్రలో భాగంగా సీఎం జగన్ నేడు మదనపల్లెలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు.
సీఎం జగన్ స్పీచ్ హైలెట్స్
మదనపల్లిలో అన్నమయ్యజిల్లాలో ఇక్కడ కనిపిస్తా ఉన్న అభిమానం, జససముద్రాన్నితలపిస్తా ఉంది. మళ్లీ మనందరి ప్రభుత్వం ఇంటి ఇంటికి మంచి చేస్తు ఉండాలనే ఆకాంక్షతో పేదల వ్యతిరేకులను, పెత్తందారులను, ప్రతిపక్ష కూటమి ఒడించాలని వచ్చిన నా ఆత్మ బంధువుల జన సముద్రం ఇది. ఈ చిరునవ్వుల మధ్య మీ ఆత్మవిశ్వాసం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది, ఇది చూస్తుంటే మరో ఆరువారాల్లో జరిగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో పేదల పక్షాన, పేదల భవిష్యత్తు కోసం గొప్పు గెలుపు కళ్ల ముందే కనిపిస్తుంది మీ ఉత్సాహం మధ్య పేదవారి కోసం జరగబోయే ఈ యుద్దంలో గెలుపు కోసం నేను సిద్ధం.. మీరంతా కూడా సిద్ధమేనా? ఇంటి ఇంటి అభివృద్ధని, ప్రతి ఊరి అభివృద్ది, అవ్వాతాతల సంక్షేమాన్ని, పిల్లల భవిష్యత్తుని కాపాడుకునేందుకు మీరంతా సిద్ధమే. ప్రతి ఇంటికి మంచి చేశాం. 175\175 ఎమ్మెల్యే స్థానాలు, 25\25 స్థానాలు గెలుచుకునేందుకు మీరంతా సిద్థమేనా!. 2019లో దేవుడు, మీరు ఇచ్చిన చారిత్రక తీర్పు తర్వాత మేనిఫేస్టోలో ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని, మేనిఫేస్టోని ఒక ఖురాన్ గా, బైబిల్ గా, భగవద్గీతగా భవిస్తు నేరవేర్చిన ప్రభుత్వంగా ప్రజలను ఒటు అడిగేందుకు అడుగులు వేశామంటే, విశ్వనీయతకు నిజమైన అర్థం ఇది. ఐదేళ్లు మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అందించిన తర్వాత, నేడు మీ ముందు నిలబడి సగర్వంగా సవినయంగా చెప్పగలగుతున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ్ల ఈ రాష్ట్రంలో ఏ గ్రామంలోనైనా కూడా, నా దగ్గర నుంచి మన పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, మన అభిమానులు కానీ, మన వాలంటీర్లు కానీ ప్రతి ఇంటికి వెళ్లి గడిచిన 58 నెలల్లో మీకు మంచి జరిగి ఉంటే మీ జగన్ కు, మన ప్రభుత్వానికి, వైయస్ఆర్సీపీ ప్రభుత్వానికి అండగా తోడుగా నిలబడండి అని ఆత్మ విశ్వాసంతో అడగగులుగుతున్నారంటే మీ చల్లని దీవెనలతో ప్రతి గ్రామానికి మంచి చేయబట్టే. ఎన్నికలు వస్తున్నాయి అంటే, ప్రతిపక్షాలు విడి విడిగా రాలేపోతున్నారు. అధికారంకోసం గుంపులుగా తోడేళ్ళుగా జెండాలు జత కట్టి అబద్ధాలతో వస్తున్నారు. జెండాల జతకట్టడమే వారి పని, ప్రజల గుండెల్లో గుడి కట్టడమే మీ జగనే చేసిన పని. ఇంత మంచి చేశాము కాబట్టే ప్రతి గుండెల్లో మీ జగన్ ఉన్నడు, అందుకే ఒక్కడి మీద ఎంతమంది దాడి చేస్తున్నారో చూడండి, పచ్చమీడియా, దత్తపుత్రుడు, బీజేబీ, కాంగ్రెస్, కుట్రకుతంతాలతో ఇంత మంది ఏకమవుతున్నారంటే ఆలోచన చేయండి.. మీ జగన్ ప్రతి ఇంటికి మంచి చేయకపోయి ఉంటే, ఇన్ని కుట్రలు, ఇన్ని జెండాలు జత కట్టి రావటానికి కారణమేంటి. వాళ్లందరికి తెలియాని విషయం ఒకటి ఉంది. 99 మార్కులు తెచ్చుకున్న స్టూడేంట్ పరీక్షలకు భయపడతారా.. గతంలో వారు పరీక్షలు రాసినప్పుడు 10మార్కులు కూడా తెచ్చుకోని వారు పరీక్ష పాస్ అవుతారా. కనీసం 10శాతం మంచి చేయని బాబు, ఆయన కూటమీ మీ బిడ్డ ముందు నిలబడుతుందా? విలువలు, విశ్వనీయత లేని ఇలాంటి వారితో 30 పార్టీలు కలిసి వచ్చిన, ఇలాంటి పొత్తులు చూసి మన అభిమానులు, మన నాయకులు, మన వాలంటీర్లు, మనం మంచి చేసిన ఇళ్లలోని ఏ ఒక్కరైన భయపడతారా? ఎవరు భయపడరు.. మీకు చెబుతున్న సమాధానం… మేమంతా సిద్ధం. ఐదేళ్ల పాలన తర్వాత జరుగుతున్న ఈ యుద్ధానకి ఎలా సిద్ధమైయ్యాము అంటే, కారణం.. ఇంటి ఇంటికి అందితేనే సంక్షేమమని చూపించాం కాబట్టి, గ్రామానికి మంచి చేసి చూపించాం కాబట్టి, మంచి చేసే ప్రక్రియలో ఎక్కడ కులం చూడలేదు, మతం, రాజకీయాలు, పార్టీలు చూడలేదు.. ఆర్హతే ప్రామాణికంగా మంచి చేశాం. అందుకే మనకు ప్రతి ఒక్కరికి గతంలో జరగని విధంగా మేలు చేశాం కాబట్టే, ఇంటి ఇంటికి వెళ్లి ఒటు అడిగే అర్హత వైసీపీకి మాత్రమే ఉంది.
గత ప్రభుత్వం చేసనవి చూపించి, మనం చేసిన మంచి చూపించి, ఫ్యాన్ కు ఒటు వేస్తేనే ఈ పథకాలు కొనసాగుతాయని చెప్పే నైతికత మనకు ఉంది. 175\175 ఎమ్మెల్యే స్థానాలు, 25\25 ఏంపీ స్థానాలు ఎందుకు రావాలి అంటే.. మన అక్కచెల్లమ్మలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు రావాలి.. ప్రతి కుటుంబంలో అక్కచెల్లమ్మలను కుటుంబం మూలంగా, బలమైన శక్తిగా నిలబెట్టే ప్రక్రియ కొనసాగాలనే తపన మళ్లీ అధికారం అడుతున్నాను. గతంలో ఎన్నడు లేని విధంగా ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా రూ. 2.70లక్షల కోట్లు అందించాం. డీబీటీ కాకుండా నాన్- డీబీటీ చూస్తే దాదాపు లక్ష కోట్లు అంటే మొత్తంగా కలుపుకుని రూ.3. 70లక్షల కోట్లు. లంచాలు లేకుండా మనం చేసి ట్రాక్ రికార్డు. అదే చంద్రబాబు పేరు చెబితే ఆయన చేసిన ఏ మంచి గుర్తుకురాదు, ఆయన చేసి స్కీం కూడా గుర్తుకురాదు. అదే మీ జగన్ పేరు చెబితే… గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు, వారు అందించే పింఛన్, లంచాలు వివక్ష లేని పాలన అంటే గుర్తుకువచ్చేది మీ జగన్, మీ ఊరికి విలేజ్ క్లీనిక్, ఇంటి వద్దకే వైద్య సేవలు, ఇంగ్లీష్ మీడియం అంటే గుర్తువచ్చేది జగన్.. ప్రపంచ స్థాయిలో చదువులు, డిజిటల్ బోధన, ట్యాబులు అంటే జగన్ గుర్తువస్తాడు, రైతన్నలకు రైతు భరోసా, ఉచిత విద్యుత్, ఇన్ పూట్ సబ్సీడీ, 30లక్షల భూమిపై శాశ్వత హక్కు ఇచ్చనదేవరంటే గుర్తువచ్చేది జగన్… 2.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది మీ జగన్. అక్కచెల్లమ్మల పేరిట 31లక్షల ఇళ్ల పట్టాలు అందించింది మీ జగన్. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా అక్కచెల్లమ్మల కుటుంబానికి తొడుగా ఉంటు, అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, కాపునేస్తం, షాదీతోఫా పథకాలంటే గుర్తువచ్చేది జగన్. మహిళా సాధికారత అంటే గుర్తుకువచ్చేది జగన్. రాష్ట్రంలో 17 మెడికల కాలేజీలు తీసుకువచ్చాం, 4 కొత్త పోర్టులు నిర్మాణాలు జరుగుతున్నాయి, కొత్త పారిశ్రమలు వచ్చింది మీ బిడ్డ పాలనలోనే.
మరోసారి ఎన్నికల సమయం వచ్చేసింది.. ఇలాంటి సమయంలో ఒక్కసారి ప్రతిపక్షకూటమి గురించి కూడా మట్లాడుకుందాం. ఈ ఎన్నికల్లో మనం పోరాడుతున్నది, మోసాలే అలవాటుగా అబద్ధాలే పునాదిగా చేసుకున్న జిత్తులమారి పొత్తుల ముఠాతో యుద్ధం చేస్తాం.. ఆ ముఠా నాయకుడు నారా చంద్రబాబు. ఆరుంధతి సినిమాలో సమాధిలోనుంచి వచ్చిన పుసుపతిలాగా అధికారం కోసం చంద్రబాబు అనే పుసుపు పతి ఐదేళ్ల తర్వాత లేచి వచ్చి వదల బోమ్మాళి వదల అంటూ పేదల రక్తం పీల్చేందుకు ముఖ్యమంత్రి కుర్చిని చూసి కేకలు పెడుతున్నాడు ఈ పుసుపు పతి. నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతున్నాడు.. ఈ పసుపు పతి గురించి 2014లో ఏం జరిగిందో గుర్తుతెచ్చుకుందాం. మూడుపార్టీలతో పొత్తులు పెట్టుకుని మూడు పార్టీలు కలిసి ఇంటి ఇంటికి తన ముఖ్యమైన హామీలు అంటు ఇంటి ఇంటికి చంద్రబాబు, దత్తపుత్రుడు, మోదీ ఫోటోలతో మేనిఫేస్టో పంపించారు. ముఖ్యమైన హామీల్లో ఒకటి రైతుల రుణమాఫీ పై సంతకం చేస్తా అన్నాడు, చేశాడా? రెండవది పొదుపు సంఘాల రుణమాఫీ చేస్తామని చెప్పాడు, చేశాడా? ఆడుబిడ్డ పుట్టిన వెంటనే రూ. 25వేల బ్యాంకులో డిపాజిట్ చేస్తాని అన్నాడు, చేశాడా? నిరుద్యోగ భృత్తి ఇస్తానని అన్నాడు.. చేశాడా? సింగపూర్ కి మించి చేస్తా అన్నాడు.. చేశాడా? మహిళల రక్షణకు ఉమెన్ ప్రోటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తా అన్నాడు.. జరిగిందా?
ప్రత్యేక హోదా ఇచ్చారా? ఏ ఒక్క హామీ నేరవేర్చకపోయారు? సూపర్ సీక్స్ అంటూ మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారు.
గతంలో ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా ఈ ముగ్గురు మళ్లీ వస్తున్నారు, 2014 కంటే ఇంకా ఎక్కువ హామీలు ఇస్తు మరో డ్రామాకు తెర లేపారు. ఆలోచన చేయండి.. వదల బోమ్మాళ్లి అంటు పేదల రక్తం పీల్చేందుకు ఈ పుసుపు పతిని ఏ ఒక్కరైన నమ్మ వచ్చా!. మరోసారి మన రాష్ట్రాన్ని దోచుకోవచ్చని బాబు ప్లాన్.. వీళ్లకి అధికారం కావాల్సీ దోచుకోవటం, పంచుకోవటం కోసం మాత్రమే.
ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం వద్దన్న వారికి బుద్ది చెప్పాల వద్దా! పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కులాల మధ్య సమతూల్యం దెబ్బ తింటుందని కోర్టులకు వెళ్లి కేసులు వేసిన వారికి సమాధులు కట్టండి, ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నవారికి చేరమగీతం పాడమని కోరుతున్న, బీసీల తోకలు కత్తిరిస్తానన్న బాబును, బాబును వెనకేసుకువస్తున్న తోకల అందిరి తోకలు కత్తిరించే కార్యక్రమానికి శ్రీకారం చూట్టమని కోరుతున్న, గతంలో నాన్నగారు ఇచ్చిన 4శాతం ఇచ్చిన రీజర్వేషన్ తోను, మైనార్టీల మనోభావలతో చెలగాటమడుతున్న వారితో 30 చెరువులు నీళ్లు తాగించండి. జరగబోయేది ఏమిటంటే.. ప్రజలకు మంచి చేసిన ఫ్యాన్ మీ ఇంట్లోనే ఉంటుంది, అధికారంలోనే ఉంటుంది, ప్రజలను పదే పదే మోసం చేసే సైకిల్ ఇంటి బయటే ఉంటుంది, బాబు ప్యాకేజీ తాగే గ్లాసు సింక్ లోనే ఉంటుంది.. ఇది ప్రజల మాట. ఆ పొత్తుల, ఎత్తుల, జిత్తలు ముఠా ఎన్ని చేసిన, మన ప్రజలకు చెప్పేది ఒక్కటే.. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేనో, ఎంపీలను ఎన్నుకునే ఒటు మాత్రమే కాదు.. ఈ ఒటు మన భవిష్యత్తు మన తలరాతలు ఒటు మీద ఆధారపడి ఉంటుంది.. మళ్లీ మీ అన్న రావాలి, పేదవాడి భవిష్యత్తు బాగుపడటానికి ప్రతి ఒక్కరికి ప్రతి గడపకు వెళ్లి చెప్పండి. మూడు రోజుల క్రితం ఎం జరిగిందో చూస్తున్నారుగా.. లక్షల మందికి అవ్వాతాతలకు వికాలంగులుకు వితంతవు అక్కచెల్లెమ్మలకు, తమని తాము పోషించుకోలని అభాగ్యులకు, జీవితాలు గడవని వారికి నెల నెల 1వ తారీఖున ఉదాయన్నే చిక్కటి చిరునవ్వుతో ఇచ్చే వాలంటీర్ల పై చంద్రబాబు తన మనుష్యుల చేత ఈసీకి ఫిర్యాదు చేసి పింఛన్ పంపిణిని ఆపించాడు. చంద్రబాబు మనిషి నిమ్మగడ్డతో ఫిర్యాదు చేపించి జగన్ ను నేరు ఏమి చేయలేక కనీసం ఎవరికి నష్టం జరుగుతుందో ఆలోచించకుండా 66 లక్షల మంది పేదలకు నష్టం కలిగిస్తున్నాడు.. వారికి సాయపడుతున్న వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాడు. గతంలో కూడా ఇంగ్లీష్ మీడియం వద్దని వ్యతిరేకించాడు, అక్కచెల్లమ్మలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే వ్యతిరేకించాడు.. చివరికి అవ్వాతాతలకు ఇచ్చే పింఛన్ ను ఇంటిఇంటికి రాకుండా అడ్డు తగులుతున్నాడు.. ఇదంతా పెత్తందారి భావజాలం కాదా? ఇలాంటివారికి పోరపాటున ఒటు వేస్తే తమకు అంతే స్కీంలను, వాలంటీర్ వ్యవస్థను సైతం అన్నిటిని రద్దు చేసేందుకు మనమే గ్రీన్ సీగ్నల్ ఇస్తు ఒటు వేసినట్టే ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. మీ అందరికి ఒక్కటే చెబుతున్న.. పేదలకు అందాల్సిన ప్రతి ఒక్క రూపాయి బాబు ఆపినా.. మీ పింఛన్ నేరుగా మీ ఇంటికే రావాలంటే, నేరుగా పింఛన్ పోందాలంటే బాబు లాంటి సైంధువలకు అడ్డుపడే అవకాశం ఇవ్వకూడదు.. అలా జరగాలంటే మరో 45 రోజుల్లో రెండు బటన్ లు నోక్కాలి.. మీ బిడ్డ మీకోసం 130 సార్లు బటన్ నోక్కాలి.. నా అక్కచెల్లమ్మలు, నా పేదులు అంతా ఒక్కటై రెండు బటన్ లు నోక్కాలి.. ఫ్యాన్ మీద నోక్కాలి.. అప్పుటే వదల బోమ్మాళి మన రక్తం పీల్చటానికి రాలేదు.. అందుకే ఈ ఒటు వల్ల మీ భవిష్యతు, మీ పిల్లల భవిష్యత్తు, మీ ఆడపడుచుల భవిష్యత్తు, అవ్వతాతల భవిష్యతు అంతా మీ ఒటు మీద ఆధారపడి ఉంది.. జగనన్న మళ్లీ భారీ మెజార్టీతో వస్తే జరుగుతున్న ఈ మంచి అంతా కొనసాగుతుంది, వాలంటీర్ల ప్రతి ఇంటికి వచ్చి మీ పథకాలు అందిస్తారని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. ఎన్నికల సంగ్రమం జరుగుతుంది.. అబద్ధాన్ని, మోసాన్ని మట్టికలిపించటానికి నేను సిద్ధం.. మీరుసిద్ధమా! అబద్ధాలకు, మోసాలకు వారు ప్రతినిధులైతే, విలువలకు, విశ్వనీయతకు మనం ప్రతినిధులం.