ప్రజాశాంతి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాబు మోహన్
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్
హైదరాబాద్ : బీజేపీకి తెలంగాణలో ఓటు బ్యాంకు లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని పార్లమెంట్ నియోజక వర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటారని చెప్పారు. ఇటివలే తమ పార్టీలో చేరిన బాబు మోహన్ వరంగల్ నుంచి పోటీలో ఉంటారని అన్నారు. ఆయనకు ప్రజాశాంతి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్‌లో నలుగురు ఏక్నాథ్ షిండేలు సిద్ధంగా ఉంటారని చెప్పారు. అందులో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరో ఇద్దరు నేతలు ఆ పార్టీలో ఉన్నారని వారే ఆ ప్రభుత్వాన్ని పడగొడతారని అన్నారు. 100 రోజుల కాంగ్రెస్ పాలనలో జనానికి తాగునీరు ఇవ్వలేక పోయారని, కరెంట్ కష్టాలు మొదలు అయ్యాయని అన్నారు. రేవంత్ సర్కారు అప్పుల ఉబ్బిలో కురుకుపోయిందని మిగిలిన హామీలు ఎలా నేరవేర్చుతారని ప్రశ్నించారు. తన సమ్మిట్‌ను హైదరాబాద్‌లో పెట్టవద్దని రేవంత్ రెడ్డికి టీడీపీ చీఫ్ చంద్రబాబు చెప్పారని అన్నారు. కేఏ పాల్ సమ్మిట్‌కు పర్మిషన్ ఇస్తే ఇబ్బందులు పడతావని రేవంత్‌ను చంద్రబాబు హెచ్చరించారని అన్నారు. గతంలో హైదరాబాద్‌కు పలు కంపెనీలను తెచ్చింది తానేనని అది చంద్రబాబుకు కూడా తెలుసునని చెప్పారు. అప్పుల ఉబ్బిలో కురుకుపోయిన తెలంగాణను అభివృద్ధి చేయాలంటే తమ అభ్యర్థులను ఏపీ, తెలంగాణ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఏపీలో తమ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ఏపీని మరింతగా అభివృద్ధి చేస్తానని కేఏ పాల్ అన్నారు.