హైదరాబాద్: టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు పై సీఎం రేవంత్ రెడ్డికి దుబాయ్ నుంచి బాధితుడు శరన్ చౌదరి ఫిర్యాదు చేశారు. రాధా కిషన్ రావు, సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు తనను వేధింపులకు గురి చేశారంటూ బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. 2023 ఆగస్టు 21వ తేదీన ఆఫీస్‌కి వెళ్తున్న క్రమంలో మార్గం మధ్యలో సివిల్ డ్రెస్సులు కొంతమంది పోలీసులు తనని కిడ్నాప్ చేశారని శరన్ చౌదరి తెలిపారు. సివిల్ డ్రెస్ లో వచ్చి ప్రైవేట్ కార్లు తనని సీసీఎస్‌కు తీసుకెళ్లి వేధింపులకు గురి చేశారని బాధితుడు చెప్పాడు..