మల్కాజ్ గిరి మాజీ శాసన సభ్యులు మైనంపల్లి హనుమంత్ రావు
మల్కాజ్ గిరి : రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని గెలిపించినట్లే పట్నం సునీతా మహేందర్ రెడ్డిని గెలిపించాలని మల్కాజ్ గిరి మాజీ శాసన సభ్యులు మైనంపల్లి హనుమంత్ రావు కోరారు. రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు ప్రతి కార్యకర్త పార్టీ అభ్యర్థుల విజయం కోసం నియోజక వర్గాల వారిగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. శుక్రవారం మల్కాజ్ గిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమావేశానికి మల్కాజ్ గిరి మాజీ శాసన సభ్యులు మైనంపల్లి హనుమంత్ రావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్ గిరి కాంగ్రెస్ పార్లమెంటరి అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి, ఎం.ఎల్.సి, పట్నం మహేందర్ రెడ్డి, కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థి గణేష్, గద్దర్ వెన్నెల, కంటోన్మెంట్ మాజీ వైస్ చైర్మన్ జయ ప్రకాష్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.