హైదరాబాద్ బ్యూరో ప్రతినిధి : తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేయడంపై తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ప్రజా సేవ కోసం తిరిగి వెళ్తున్నా. తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలు. నేను ఎప్పటికీ మీ సోదరినే. నాపై చూపిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలని తెలిపారు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో తమిళనాడు నుంచి బీజేపీ తరపున ఆమె బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గవర్నర్ పదవి చేపట్టకముందు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఆమె వ్యవహరించిన విషయం తెలిసిందే. 2019 సెప్టెంబర్ 8న ఆమె తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించారు. ఈ పదవికి కూడా ఆమె రాజీనామా సమర్పించారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపించారు