మేడిగడ్డ బ్యారేజీని మంగళవారం సాయంత్రం ప్రజా ప్రతినిధుల బృందం పరిశీలించింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర రావుతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నేతలు.. ప్రాజెక్టు దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించారు.
భారాస, భాజపా సభ్యులు ఈ పర్యటనకు దూరంగా ఉన్నారు.
ఉదయం అసెంబ్లీ నుంచి బస్సులో బయలుదేరిన ప్రజా ప్రతినిధులు సాయంత్రం 3 గంటలకు మేడిగడ్డ చేరుకున్నారు. ప్రధానంగా బ్యారేజీలో దెబ్బతిన్న ఏడో బ్లాక్ లోని పిల్లర్స్‌ను పరిశీలించారు.
మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై సమీక్ష సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి..
కేసీఆర్ కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చామనడం పచ్చి అబద్ధం.. లక్ష కోట్లు ఖర్చు చేసి కనీసం లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదు. రూ. 94 కోట్లు ఖర్చు చేసి నీళ్లు ఇచ్చింది 98,570 ఎకరాలకు మాత్రమే.. కేవలం కరెంటు బిల్లులే ప్రతీ ఏటా రూ. 10,500 కోట్లు ఖర్చవుతోంది. ప్రతీ ఏటా బ్యాంకు రుణాలు, ఇతరత్రా చెల్లింపులకు రూ. 25 వేల కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి.. ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి కావడానికి దాదాపు రూ. 2 లక్షల కోట్లు ఖర్చవుతుంది.. ఇప్పటి వరకు అబద్ధపు ప్రచారాలతో కేసీఆర్ కాలం గడిపారు: రేవంత్ రెడ్డి..