తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీ, దూలపల్లిలో 10వ బ్యాచ్ అటవీ క్షేత్రాధికారుల
శిక్షణా కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. మహారాష్ట్రకు చెందిన (30) మంది
అధికారులతో ప్రారంభమైన ఈ కార్యక్రమం (18) నెలల పాటు కొనసాగుతుంది. ఈ
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి, ముఖ్య
వన్యప్రాణి సంరక్షకులు, మోహన్ చంద్ర పర్గెయిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ అటవీ ఉద్యోగం, మిగతా ఉద్యోగాల మాదిరిగా కాకుండా, ప్రత్యేకమైనదని,
పరిసరాలపై పెరుగుతున్న ఒత్తిడుల దృష్ట్యా, అటవీ అధికారుల విధి నిర్వహణ సవాలుగా
మారిందని అన్నారు. కొత్తగా ఉద్యోగంలోకి చేరిన అటవీ అధికారులు తమకు నచ్చిన
విషయంలో ప్రావీణ్యతను సంపాదించడానికి కృషి చేయాలని, శిక్షణా సమయంలో
వృత్తిపరమైన విషయాలపై దృష్టి పెట్టాలని, నైపుణ్యాలను సంపాదించుకోవడానికి
పూర్తి సమయాన్ని కేటాయించాలని కోరారు. ప్రకృతికి, ప్రజలకు, ప్రస్తుత మరియు
రాబోయే తరాలకు కూడా సేవ చేసే అవకాశం అటవీ ఉద్యోగం కల్పిస్తుందని ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమంలో అకాడమీ డైరక్టర్, ఎస్. జె.ఆషా, అదనపు డైరెక్టర్, ఎస్. రమేశ్
కూడా ప్రసంగించారు. అటవీ అకాడమీ సంయుక్త డైరెక్టర్ మరియు అటవీ క్షేత్రాధికారుల
శిక్షణా కార్యక్రమం కోర్స్ డైరెక్టర్ ప్రవీణ, డిప్యూటీ డెరైక్టర్ లు సి హెచ్
గంగా రెడ్డి, వి. రామ మోహన్, కె.శ్రీనివాస్, ఎస్. ఎ.నాగినీ బాను,
ఎన్.ఆర్.సంగీత, పి.వి.రామ కృష్ణ సమావేశంలో పాల్గొన్నారు. విశ్రాంత అటవీ
అధికారులు ప్రదీప్, రవీందర్ మరియు అధ్యాపకులు అనిత్, రేంజ్ అధికారులు, M వంశీ
కృష్ణ, సుభాష్ చంద్ర యాదవ్, రామ్ మోహన్, బాబా ఖాదర్ వలీ, డిప్యూటీ రేంజ్
అధికారి ఉమా రాణి, సెక్షన్ అధికారి ప్రవీణ్ కుమార్, ఫిజికల్ ట్రైనర్స్, అశోక్
రెడ్డి, కొండల్ రావు, అనిల్ శిక్షణ అటవీ బీట్ అధికారులు, శిక్షణ అటవీ సెక్షన్
అధికారులు, ఇతర సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.