ఆర్థిక శాఖపై సచివాలయంలో బుధవారం ముఖ్యమంత్రి సమీక్ష
హైదరాబాద్ : 2024-25 వార్షిక బడ్జెట్ వాస్తవికతను ప్రతిబింబించాలని
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆర్థిక శాఖపై
సచివాలయంలో బుధవారం సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సవాళ్లు, లక్ష్యాలపై ప్రజలకు వాస్తవాలు చెబుదాం.
తెలంగాణ ఇప్పుడే వచ్చిందనుకొని బడ్జెట్ తయారు చేయాలి. ప్రజా శ్రేయస్సే అంతిమ
లక్ష్యంగా బడ్జెట్‌పై కసరత్తు జరగాలి. హామీల అమలుకు వ్యయ అంచనాలు పక్కాగా
ఉండాలి. ప్రజలకు అర్థమయ్యేలా బడ్జెట్ రూపకల్పన జరగాలి. దాపరికం లేకుండా ఆదాయ
వ్యయాల ముఖచిత్రం ఉండాలి. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లను పూర్తిగా సద్వినియోగం
చేసుకోవాలి. కేంద్రానికి పేరు వస్తుందనే భేషజాలకు పోవద్దు. కొత్త వాహనాలు
కొనుగోలు చేయకుండా ఉన్న వాటినే వాడుకోవాలని సీఎం అధికారులకు సూచించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని..సవాళ్లు.. లక్ష్యాలపై ప్రజలకు వాస్తవాలను
చెబుతామని, తెలంగాణ ఇప్పుడే వచ్చిందనుకొని బడ్జెట్‌ను తయారు చేయాలని
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ2024-25 వార్షిక
బడ్జెట్ వాస్తవికతను ప్రతిబింబించాలని అధికారులకు సూచించారు. ప్రజాశ్రేయస్సు
లక్ష్యంగా బడ్జెట్‌పై కసరత్తు జరగాలన్నారు. హామీల అమలుకు వ్యయ అంచనాలు పక్కాగా
ఉండాలని.. ప్రజలకు అర్థమయ్యే విధంగా బడ్జెట్ రూపకల్పన జరగాలన్నారు. ఆదాయ,
వ్యయాలకు సంబంధించి ఎలాంటి దాపరికం ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కేంద్రానికి పేరు వస్తుందనే భేషజాలు మనకు అవసరం లేదన్నారు. కొత్త వాహనాలు
అవసరం లేదని ఉన్న వాహనాలను ఉపయోగించుకోవాలన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి
విక్రమార్క, సీఎస్ శాంతికుమారి, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
[image: image.png]