పరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం కానివ్వబోమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
స్పష్టం చేశారు. సోమవారం మణుగూరు సింగరేణి ఓసి 2 వద్ద ఏర్పాటు చేసిన ఫిట్
మీటింగ్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని మాట్లాడుతూ సింగరేణి
ఎన్నికల్లో ఐఎన్టీయూసీ గడియారం గుర్తుపై ఓటే వేసి గెలిపించాల్సిందిగా
విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికలలో మీరు, నేను టీబీజీకేఎస్ గెలిపించాలని
చెప్పాను. కానీ ఇచ్చిన హామీలను గత ప్రభుత్వం నెరవేర్చలేదు. ఇచ్చిన హామీలు
నెరవేర్చలేదని ఓడిపోతామని తెలిసి గత ప్రభుత్వం ఎన్నికలు జరుపలేదు. ఈ ప్రజా
ప్రభుత్వంలో మీ కోరికలు తీర్చడానికి నేను ఒక మంత్రిగా ఉన్నాను. కాబట్టి ఈ
వేదిక మీద నుంచి ఇచ్చిన హామీలను నెరవేరుస్తాను. పదవి ఉన్నపుడు నెరవేర్చలేనిది
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నెరవేరుస్తామని అనడం విడ్డూరంగా ఉంది.ఇద్దరం కలిసి
పోటీ చేయడానికి వారు నిరాకరించారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
కారుణ్య నియామకాలు ఇస్తాం : ‘‘ఏ పార్టీకి ఓటే వేస్తే మనం ప్రశాంతంగా ఉంటామో
ఆలోచించి ఓటు వేయాలని నా మనవి. ఇప్పుడు మీకు , నాకు మంచి రోజులు వచ్చాయి
కావున మన వాళ్లను అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని నేను ఈ వేదిక మీద
నుంచి హామీ ఇస్తున్నాను. ప్రతి కార్మికుడికి 200 గజాల స్థలంతో పాటు 20 లక్షల
వడ్డీ లేని రుణం ఇస్తాం. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కారుణ్య నియామకాలు ఇస్తాం.
సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తామని గత ఎన్నికల్లో చెప్పాను.. కానీ గత
ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. కానీ ఈ ప్రజా ప్రభుత్వంలో హాస్పిటల్
కట్టిస్తామని హామీ ఇస్తున్నాం. సింగరేణి డే రోజున వేతనంతో కూడిన సెలవు దినంగా
ఇస్తాం. అలవెన్సులు మీద ఇన్ కం ట్యాక్స్ యాజమాన్యం కట్టే విధంగా ఆదేశాలు
ఇస్తాం. కొత్త గనులను ప్రారంభించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఈ ప్రజా
ప్రభుత్వం హామీ ఇస్తుంది. గత ప్రభుత్వ పాలనలో మీరు, నేను మోసపోయాం.. గోస
పడ్డాం. కావున కార్మిక సోదరులు ఆలోచించి ఓటు వేయాలని మంత్రి పొంగులేటి
శ్రీనివాసరెడ్డి కోరారు.
[image: image.png]