పార్టీ రాజకీయంగా పలు కీలక మార్పులు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో రానున్న
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా హైకమాండ్ నిర్ణయం మేరకు ఉమ్మడి పది
జిల్లాకు ఇన్చార్జ్ మంత్రులను సీఎం రేవంత్‌రెడ్డి నియమించారు. ఈ మేరకు
కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఇన్చార్జ్ మంత్రుల జాబితాను ప్రకటించింది.
కరీంగనర్ జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా ఉత్తమ్ కుమార్‌రెడ్డి, మహబూబ్‌నగర్
జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా దామోదరం రాజనర్సింహ, ఖమ్మం జిల్లాకు
ఇన్చార్జ్ మంత్రిగా కోమటిరెడ్డి వెంటకరెడ్డి, వరంగల్ జిల్లాకు ఇన్చార్జ్
మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ జిల్లాకు ఇన్చార్జ్
మంత్రిగా పొన్నం ప్రభాకర్, మెదక్ జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా కొండా
సురేఖ, ఆదిలాబాద్ జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా ధనసరి అనసూయ (సీతక్క),
నల్గొండ జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా తుమ్మల నాగేశ్వర రావు, నిజామాబాద్
జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా జూపల్లి కృష్ణారావు , రంగారెడ్డి జిల్లాకు
ఇన్చార్జ్ మంత్రిగా శ్రీధర్‌బాబును నియమించారు.