రాజనర్సింహ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం హైదరాబాదులోని డాక్టర్ బి.ఆర్
అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించారు.
ఈ సమీక్ష సమావేశంలో వివిధ ఆస్పత్రిలో ఉన్న వెంటిలేటర్ ల పనితీరును
పరిశీలించాలని వైద్యశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. కరోనా బాధితుల
చికిత్సకు అవసరమయ్యే ఆక్సిజన్ కన్సన్ట్రేటర్స్ లను తక్షణమే ఉపయోగంలోకి తేవాలని
మంత్రి అధికారులను ఆదేశించారు. వాడుకలో లేని వివిధ ఆస్పత్రిలో ఉన్న PSA
ప్లాంట్స్ త్వరితగతిన పునరుద్ధరించాలనీ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
అధికారులను మంత్రి C . దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఈ సమీక్షలో భాగంగా
వివిధ ఆస్పత్రిలో కరోనా వార్డులలో అవసరమైన యంత్రాలను, అవసరమైన డ్రగ్స్ ,
డయాగ్నస్టిక్ ఎక్విప్మెంట్ లను సమకూర్చుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
RTPCR లాబ్స్ ను ప్రభుత్వ ఆసుపత్రిలో 34, RTPCR లాబ్స్ లను 84 ప్రైవేట్
ఆస్పత్రిలో రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉంచామన్నారు. ప్రతిరోజు 16,500 మంది
కి RTPCR ద్వారా టెస్టు samples కలెక్ట్ చేసుకునే సామర్ధ్యాన్ని కలిగి
ఉన్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ గారికి వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
అధికారులు వివరించారు. TSMSIDC ద్వారా RTPCR కీట్స్, VTMs లను కొనుగోలు
చేయాలని, కరోనా వార్డులలో అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవాలని మంత్రి ఈ
సమీక్షలో అధికారులను ఆదేశించారు. గత రెండు వారాలుగా వివిధ ఆసుపత్రుల ద్వారా
ఏర్పాటు చేసిన వార్డులలో 6,344 శాంపిల్స్ లను కలెక్ట్ చేసుకున్నామని అధికారులు
మంత్రికి వెల్లడించారు. కలెక్ట్ చేసుకున్న శాంపిల్స్ ల ఫలితాల కోసం
ఎదురుచూస్తున్నామన్నారు. డిసెంబర్ నెల ముగిసేలోపు 4000 మంది కి టెస్టులు
నిర్వహించాలని టార్గెట్ నిర్ణయించుకున్నట్టు అధికారులు మంత్రికి వెల్లడించారు.
COVID- 19 పై ప్రతిరోజు మీడియాకు సాయంత్రం నాలుగు గంటలకు బుల్ టెన్ విడుదల
చేయాలని మంత్రి C. దామోదర రాజనర్సింహ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ
శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ
ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్
RV కన్నన్, రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వివిధ శాఖల
విభాగాధిపతులు, గాంధీ, ఉస్మానియా, చెస్ట్ హాస్పిటల్, నిలోఫర్ ఆసుపత్రి ల
మెడికల్ సూపరింటెండెంట్ లు, CDFD లాబ్స్ ఇంఛార్జి లు పాల్గొన్నారు.