హైదరాబాద్ : మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు 19వ వర్ధంతి సందర్భంగా గాంధీ భవన్
లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పి.వి చిత్రపటానికి
పూలమాలలు వేసి వివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పి.వి
దేశానికి చేసిన సేవలను కొనియాడారు.
ప్రపంచ మేధావి ఆర్థిక నిపుణులు, బహుభాషా కోవిదులు పి.వి మన తెలంగాణ వారు కావడం
గర్వకారణం. కింది స్థాయి నుంచి అనేక పదవులు నిర్వహించి పార్టీకి దేశానికి
గొప్ప పేరు తెచ్చి పెట్టారు. భూ సంస్కరణ, ఆర్థిక సంస్కరణలు చేపట్టి వాటిని
పకడ్బందీగా అమలు చేసిన మేధావి. దేశాన్ని ఆర్థిక విపత్కర పరిస్తితి నుంచి
కాపాడి బలోపేతం చేసిన గొప్ప సంస్కర్త. ఆయన సిద్ధాంతాలను, విధానాలను అమలు
చేస్తాం. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు అనిల్ యాదవ్, ఆదిలాబాద్ కంది
శ్రీనివాస్ రెడ్డి, అల్లం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.