రెండు, మూడు స్థానాల్లో గజ్వేల్, హైదరాబాద్ సౌత్ ఉన్నాయని ముఖ్యమంత్రి
రేవంత్‌రెడ్డి తెలిపారు. విద్యుత్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా
అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్
సౌత్ నుంచి ఎన్నికైన వారే గత తొమ్మిదేళ్లు తెలంగాణను పాలించారు. భారాస, ఎంఐఎం
వేరు కాదు.. ఇద్దరూ కలిసే పాలించారు. విద్యుత్ కోతలపై ధర్నాలు చేశారా? అని
జగదీశ్‌రెడ్డి అడిగారు. కామారెడ్డి నియోజకవర్గంలో విద్యుత్‌లేక పంటలు
ఎండిపోతున్నాయని సబ్‌స్టేషన్ వద్ద రైతులు ధర్నా చేశారు. ధర్నాల వార్తల
క్లిప్పింగులు ఇవిగో.. పరిశీలించుకోండి. (పేపర్ క్లిప్పింగులను చూపిస్తూ).
ఓల్డ్ సిటీ, న్యూ సిటీ అనే తేడాలేదన్నారు.
అక్బరుద్దీన్ సహచర ఎమ్మెల్యేలను గౌరవించాలి. సభలో ప్రస్తుతం 57 మంది కొత్తగా
ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉన్నారు. అధికారంలోకి రాగానే అక్బరుద్దీన్‌ను ప్రొటెం
స్పీకర్‌ను చేశాం. ముస్లింల అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది.
అక్బరుద్దీన్ కేవలం ఎంఐఎం అధినేత మాత్రమే. ఆయనను మేం ముస్లిం ప్రతినిధిగా
చూడట్లేదు. చాంద్రాయణగుట్టలో హిందువులు కూడా ఆయనకు ఓటు వేశారు. మాకు ఓల్డ్
సిటీ, న్యూ సిటీ అనే తేడాలేదు. మేం అజహరుద్దీన్‌కు టికెట్ ఇస్తే
అక్బరుద్దీన్ ఓడించే ప్రయత్నం చేశారు. షబ్బీర్ అలీని ఎంఐఎం ఓడించాలని
చూసింది. భారాస దుర్మార్గాలు మిత్రపక్షమైన ఎంఐఎంకు కనిపించలేదా? భారాస
ప్రోగ్రెస్ రిపోర్టు మాత్రమే చదువుతున్న అక్బరుద్దీన్‌కు లోపాలు కనిపించలేదా?
గత ప్రభుత్వాన్ని అదే పనిగా ఎంఐఎం పొగుడుతూ ఉంటే వినేందుకు మేం సిద్ధంగా లేము.
తెలంగాణ ప్రజలు మీ మిత్రపక్షం భారాసను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. భారాస
తరఫున ఎంఐఎం ఎందుకు వకాల్తా పుచ్చుకుంటోంది. మైనారిటీల విషయంలో కాంగ్రెస్
పార్టీ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం
చేశారు.
సీనియర్ సభ్యులు సభలో హుందాగా వ్యవహరించాలి: భట్టి విక్రమార్క
సీఎం వ్యాఖ్యలపై ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ స్పందించారు. సీఎం రేవంత్‌రెడ్డి
విద్యుత్ బిల్లుల బకాయిలపై మాట్లాడుతున్నారా? విద్యుత్ శాఖ అప్పులపై
మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..
సిద్దిపేటలో హరీశ్‌రావు, గజ్వేల్‌లో కేసీఆర్, హైదరాబాద్ సౌత్‌లో
అక్బరుద్దీన్ బాధ్యత తీసుకుని విద్యుత్ బిల్లులు చెల్లించే విధంగా
ప్రభుత్వానికి సహకరిస్తే విద్యుత్ శాఖ అప్పుల ఊబిలో నుంచి బయటపడే
అవకాశముంటుందన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ… ‘‘ప్రజలకు
ఉపయోగపడేలా సూచనలిస్తారని శ్వేతపత్రం విడుదల చేశాం. సీనియర్ సభ్యులు సలహాలు,
సూచనలు ఇవ్వాలి. సభలో ఎలా ఉండాలో కొత్త వాళ్లకు సీనియర్ సభ్యులు చెప్పాలి.
సభానాయకుడి గురించి అక్బరుద్దీన్ వ్యాఖ్యానించడం సరికాదు. సీనియర్ సభ్యులు
సభలో హుందాగా మసలుకోవాలని విజ్ఞప్తి చేశారు.
[image: image.png]