హైదరాబాద్ : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్
అగ్రనాయకురాలు సోనియా గాంధీ పోటీ చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఆ పార్టీ రాజకీయ
వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఏకగ్రీవ తీర్మానం చేసింది. 5 అంశాల ఎజెండాగా
గాంధీభవన్‌లో సోమవారం పీఏసీ సమావేశం జరిగింది. లోక్‌సభ ఎన్నికల వ్యూహంతో పాటు
ఆరు గ్యారంటీల అమలుపై భేటీలో చర్చించారు. పీఏసీ సమావేశ నిర్ణయాలను మాజీ మంత్రి
షబ్బీర్ అలీ వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపునకు కృషి చేసిన పార్టీ
అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ,
ఇతర జాతీయ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలపై
భేటీలో చర్చించామని.. ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేశామన్నారు. మిగతా
గ్యారంటీలపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటిస్తారని షబ్బీర్ అలీ
చెప్పారు. నాగ్‌పుర్‌లో ఈ నెల 28న జరిగే కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవానికి
రాష్ట్రం నుంచి 50వేల మందిని తరలిస్తామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై
సభ్యులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల ప్రాజెక్టులపై మంత్రి
ఉత్తమ్‌కుమార్ రెడ్డి వివరించారన్నారు. రేషన్ కార్డులు, ఇళ్ల విషయంలో త్వరలో
గ్రామ సభలు ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామ సభల్లోనే లబ్ధిదారులను ఎంపిక
చేస్తామన్నారు. పార్లమెంట్ స్థానాలకు మంత్రులను ఇన్‌ఛార్జిలను
నియమించామన్నారు. నామినేటెడ్ పోస్టులను నెల లోపు భర్తీ చేయాలని పీఏసీలో
నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఎమ్మెల్యే టికెట్లు త్యాగం చేసిన నాయకులకు
మొదటి ప్రాధాన్యం ఉంటుందన్నారు.