రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు
తణుకు : నియోజక వర్గంలో పంట నష్టపోయిన ఏ ఒక్క రైతు నష్టపోకుండా పంట నష్టం అంచనాలు తయారు చేయాలనీ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కోరారు. తణుకు మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలో అధికారులతో తుఫాన్ నష్టం వివరాల పై సమీక్షా సమావేశాన్ని మంత్రి కారుమూరి నిర్వహించారు. గ్రామాలలో పంట కోత ప్రయోగాలు పూర్తయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ వస్తుందని మంత్రి తెలిపారు. ఏ ఏ గ్రామాలలో ఇంకా వరికోతలు పూర్తి కాని పంట ఉంటే వారికీ భీమా వర్తిచేలా చూడాలని అధికారులకు చెప్పారు. ఇన్పుట్ సబ్సిడీ హెక్టారుకు 17 వేలు, ఇన్సూరెన్స్ కూడా రాజీ లేకుండా చేయిస్తామని స్పష్టం చేశారు. కొన్ని ప్రాంతాల్లో నారుమల్లు దెబ్బతిన్నాయని 80% రాయితీతో విత్తనాలు సరఫరా చేస్తామని చెప్పారు. సగం పంట కోత ప్రయోగాలు పూర్తి ఐతే మిగిలిన ప్రయోగాల ద్వారా రైతుకు మేలుచేయాలని కోరారు. అధికారులు మాత్రం రైతుల పట్ల ఉదారంగా వ్యవహారించాలని మంత్రి తెలిపారు . ధాన్యం రవాణా విషయంలో రైతుకు దగ్గరలోని మిల్లర్లకు తరలించేలా చూడాలని రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని పౌర సరఫరాల శాఖ అధికారులను హెచ్చరించారు. తేమ శాతం విషయంలో మిల్లర్లకు రైతులకు మధ్య తేడా వస్తే థర్డ్ పార్టీ ద్వారా తేమశాతం అంచనా వేయించి రైతులకు న్యాయం చెయాలన్నారు. యనమదుర్రు డ్రైన్ లో పేరుకు పోయిన కిక్కస కాడను యుద్ధ ప్రాతిపదికపై తొలగించాలని డ్రైనేజీ అధికారులను ఆదేశించారు. ఆరుదల కోడు వద్ద గల షెట్టర్లను మరమ్మతు చేయించటంగాని, మార్చటముగాని చేయాలనీ ఆదేశించారు. రాచకోడు షెటర్స్ ను వెంటనే బిగించాలని అధికారులను చెప్పారు. మంచిలి వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ నిమిత్తం వెంటనే ట్రాస్ఫార్మర్లు ఏర్పాటు చేయాలనీ ట్రాన్స్కో అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ అధ్యక్షుడు మంగెన సూర్య , డిసిఎంఎస్ డైరెక్టర్ పెన్మెత్స సుబ్బరాజు , అత్తిలి మండల వైసీపీ అధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ , జిల్లా వ్యవసాయాధికారి జెడ్ . వెంకటేశ్వరరావు , పౌర సరఫరాల జిల్లా మేనేజర్ శివ రామ ప్రసాద్ , తణుకు మున్సిపల్ కమీషనర్ డివి . రమణ , ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దక్షిణా మూర్తి తాసిల్దార్లు , ఎంపిడిఓలు , ట్రాన్స్కో , నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.