హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎల్పీ నేతగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికయ్యారు. శనివారం బీఆర్ఎస్ పీపీ నేత కేశవరావు అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ను బీఆర్ఎస్ఎల్పీ నేతగా ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆర్ పేరును స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రతిపాదించగా మాజీ మంత్రులు కడియం శ్రీహరి , తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆమోదించారు. శాసనసభాపక్షం మిగతా కమిటీని ఎంపిక చేసే బాధ్యతను కేసీఆర్కు అప్పగిస్తూ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. కాగా ఈ సమావేశానికి మాజీ మంత్రి కేటీఆర్ , పద్మారావు హాజరుకాలేదు. తుంటి ఎముక విరిగి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ వెంట కేటీఆర్ ఉండగా పద్మారావు దైవ దర్శనం నిమిత్తం వేరే రాష్ట్రానికి వెళ్లడంతో సమావేశానికి గైర్హాజరయ్యారు. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ముగిసిన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి బయలుదేరారు.
[https://bloomtimes.org/images/srilekha_/KCR..jpg]
[https://bloomtimes.org/images/srilekha_/KCR..jpg]