వీరికి ఆహ్వానం : కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కర్ణాటక మంత్రులు. రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లట్, ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘెల్, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహన్. తమిళనాడు సీఎం స్టాలిన్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆహ్వానం. మాజీ సీఎం కేసీఆర్కు కూడా ఆహ్వానం పంపనున్నారు. గతంలో ఇంఛార్టీలుగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, కుంతియా, వాయిలార్ రవి, మాణిక్కం ఠాగూర్, మరికొందరు ముఖ్యులు. తెలంగాణ ఏర్పాటు కీలక పాత్ర పోషించిన చిదంబరం, మీరాకుమారి, సుశీల్ కుమార్ షిండే, కురియన్, మరికొందరు నేతలు. తెలంగాణ ఉద్యమంలో అమరుల కుటుంబాలు కోదండరామ్, గాదె ఇన్నయ్య, హరగోపాల్, కంచ ఐలయ్య తోపాటు మరికొందరు ఉద్యమ కారులు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు ఆహ్వానం పంపనున్నారు. మాజీ సీఎం చంద్రబాబు, సినీ నటులకు ఆహ్వానం పంపనున్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్తోపాటు వివిధ కులసంఘాల నేతలకు, మేధావులకు ఆహ్వానం పంపనున్నారు.