ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో నిర్వహించిన భారాస నామినేషన్ ర్యాలీలో అపశ్రుతి చోటుచేసుకుంది. భారాస అభ్యర్థి జీవన్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. భారాస శ్రేణులు ర్యాలీగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి బయల్దేరారు. కేటీఆర్, ఇతర నేతలు ప్రచార వాహనంపై వెళ్లారు. ఈ క్రమంలో వాహన డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో కేటీఆర్, ఎంపీ సురేశ్‌రెడ్డి, భారాస అభ్యర్థి జీవన్‌రెడ్డి కిందపడిపోయారు. సడన్ బ్రేక్‌తో వాహన రెయిలింగ్ ఊడిపోవడంతో వారంతా కిందపడ్డారు. కిందపడడంతో కేటీఆర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఆర్మూర్ పట్టణంలోని పాత ఆలూర్ రోడ్డు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఎవరికీ ఏం కాకపోవడంతో జీవన్‌రెడ్డితో పాటు కేటీఆర్ నామినేషన్ కేంద్రానికి వెళ్లారు.