మహబూబ్‌నగర్‌లో : మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. తన నివాసం నుంచి భారీ ర్యాలీగా బయల్దేరిన మంత్రి.. పట్టణంలోని ఆర్వో కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈకార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో ఉద్యోగిగా బాధ్యతలు చేపట్టి శ్రీనివాస్‌గౌడ్ కమిషనర్‌గా పదోన్నతి పొందారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. 2014 సంవత్సరంలో గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ సూచన మేరకు మహబూబ్‌నగర్ స్థానం నుంచి పోటీ చేసి 3,139 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అనంతరం 2019 సంవత్సరంలో 57,775 భారీ మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం ఎక్సైజ్, క్రీడా, పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.