ఇంత గొప్ప కార్యక్రమం ఏ దేశంలో ఉండదు
విద్యార్థులకు అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజన పథకం అందిస్తున్న ఘనత తమదే
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్ : పేదలు, కష్టజీవుల పిల్లలకు ఇళ్లల్లో ఉదయమే అల్పాహారం చేయటం కష్టమని గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి పాఠశాల విద్యార్థులకు” సీఎం అల్పాహార పథకాన్ని ప్రవేశపెట్టారని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ పథకంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో 83,522 మందికి అల్పాహారాన్ని నిరంతర అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. శుక్రవారం ఆయన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మోడల్ బేసిక్ ఉన్నత పాఠశాలలో “ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని” ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు అల్పాహారంతో పాటు, మధ్యాహ్న భోజన పథకాన్ని అందిస్తున్నామని, ఇంత గొప్ప కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదని అన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో మూడు నెలల కిందటే అక్షయపాత్ర ద్వారా అల్పాహార పథకం ప్రారంభించామని, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని పాఠశాల విద్యార్థులకు ఒకేసారి లక్ష మందికి అల్పాహారం, భోజనం సరఫరా చేసే విధంగా కిచెన్ సైతం నిర్మించడం జరిగిందని తెలిపారు. ఇది పూర్తి హైజినిక్ కండిషన్లో ఏర్పాటుచేసి బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా దీనివల్ల అతిపెదలు, కష్టాల్లో ఉన్నవారు పొద్దున్నే పనుల నిమిత్తం బయటకు వెళ్ళినప్పుడు పిల్లలకు అల్పాహారం అందించలేని వారికి ఇది ఎంతగానో ఉపయోగ పడుతుందని, దీనివల్ల పిల్లల ఆరోగ్యాలు కూడా బాగుంటాయని అన్నారు. వారంలో ప్రతిరోజు వివిధ రకాల వంటి నాణ్యతతో కూడిన అల్పాహారాన్ని విద్యార్థులకు అందించడం జరుగుతుందని తెలిపారు. చాలీచాలని జీవితాలతో మూడు పూటలా తిండి దొరకని పిల్లల ఆరోగ్యలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. మోడల్ బేసిక్ ఉన్నత పాఠశాలలో 50 లక్షల రూపాయలతో పనులు చేపట్టడం జరిగిందని, జిల్లాలోని అన్ని పాఠశాలలకు తాగునీరు, విద్యుత్తు, రోడ్ల సౌకర్యం, టాయిలెట్లు కల్పించామని అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి వెల్లడించారు.
జిల్లా ఎస్పీ కే .నరసింహ, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ ,డి ఆర్ డి ఓ యాదయ్య ,జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్, మున్సిపల్ చైర్మన్ కెసి నర్సింహులు, మూఢ చైర్మన్ గంజి వెంకన్న, రైతుబంధు జిల్లా అధ్యక్షులు గోపాల్ యాదవ్ ,జిల్లా గొర్రె కాపరుల సంఘం అధ్యక్షులు శాంతయ్య యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజేశ్వర్, పాఠశాల విద్యా కమిటీ అధ్యక్షులు ఆనంద్ ,ఉపాధ్యాయ సంఘాల నాయకులు నారాయణ గౌడ్ ,రఘురాంరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, టీచర్లు వెంకటరెడ్డి, బాసిథ్, శ్రీనివాసులు, సీఎంవో
బాలు యాదవ్ ,పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
./