జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తండా బాటలో భాగంగా రాష్ట్ర పంచాయితీరాజ్
గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
విస్తృతంగా పర్యటిస్తున్నారు. కొడకండ్ల మండలం గిర్ని తండ, మైదం చెరువు తండ,
చెరువు ముందు తండ, బొడోని కుంట తండ, రామేశ్వరం, కడగుట్ట తండ, హక్య తండాల్లో
వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తున్నారు.
తండాల్లోని ప్రజలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అభిమానులు భారీ ఎత్తున
హాజరై తండాలను పంచాయతీలుగా చేసిన సీఎం కెసిఆర్ గారికి రుణపడి ఉంటామని
చెబుతూ…మంత్రి ఎర్రబెల్లి కి డప్పు చప్పుల్లు, డీజే సౌండ్, కోలాటాలతో
స్వాగతం పలుకుతున్నారు. మరోసారి గెలిపిస్తమని హామీ ఇస్తున్నారు