హైదరాబాద్: నగరంలో గణేశుడి మహా నిమజ్జనం సందడి మొదలైంది. హుస్సేన్‌సాగర్ సహా
సుమారు 100 ప్రాంతాల్లో నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్
మహా గణపతి శోభాయాత్ర ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. ప్రస్తుతం సెన్సేషన్
థియేటర్ వరకు చేరుకుంది. భక్తుల జయజయధ్వానాల మధ్య బడా గణేశుడు ముందుకు
సాగుతున్నాడు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్యలో హుస్సేన్‌సాగర్‌లో మహాగణపతి
నిమజ్జనం పూర్తికానుంది.

కాసేపట్లో బాలాపూర్ గణపతి లడ్డూ వేలం
మరోవైపు బాలాపూర్ గణపతి గ్రామ ఊరేగింపు ప్రారంభమైంది. ఊరేగింపు అనంతరం ఉదయం
9.30 గంటలకు లడ్డూవేలం నిర్వహించనున్నారు. ఈ వేలంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ప్రధాన ఊరేగింపు జరిగే బాలాపూర్- హుస్సేన్‌సాగర్ మార్గంలో సాధారణ వాహనాల
రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్
ప్రకటించారు. రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు.