రవీంధ్రభారతిలో వేడుకల్లో పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్
చిట్యాల ఐలమ్మ ఏఒక్క కులానికో పరిమితం కాదు, తెలంగాణ ఆస్థి ఐలమ్మ
తెలంగాణ పోరాటాలకు స్పూర్తి ప్రధాత వీరనారి చాకలి ఐలమ్మ
గత పాలకుల నిర్లక్ష్యంతో బిసిలు వెనుకకు నెట్టేయబడ్డారు
వందకోట్లకు ఎకరా ఉన్న ఏరియాలో 87.3 ఎకరాల్లో 41 బీసీ ఆత్మగౌరవ భవనాలు
19 గురుకులాల నుండి 327 గురుకులాల్లో 1,68,500 మందికి ప్రపంచ స్థాయి విద్య
ఇంటి పెద్ద పనినుండి ఇంటికిరాగానే ఇంగ్లీష్ మాట్లాడే బిడ్డల్ని చూసి గర్వంగా
ఉప్పొంగుతున్నారు
పేదవారి కళ్లలో ఈ ఆనందం కోసమే కేసీఆర్ కృషిచేస్తారు
తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని లక్ష సాయంతో బిసిల సాధికారత
5000 కోట్లు కళ్యాణలక్ష్మీ కోసం కేటాయింపు ఇందులో 50శాతం వాటా బీసీలదే
రజకుల సంక్షేమానికి 250 యూనిట్ల ఉచిత కరెంటు, 61వేల కుటుంభాలకు నెల నెలా లబ్దీ
దోబీఘాట్ల నిర్మాణం, హైద్రాబాద్ మేడిపల్లిలో 2 ఎకరాలు, 5 కోట్లతో రజక ఆత్మగౌరవ
భవనం
అధికారికంగా ఐలమ్మ జయంతి, వర్థంతి వేడుకలు, రజకులకు ఉచిత 250 యూనిట్ల కరెంట్
బిసి మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చే అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు-
గంగుల కమలాకర్
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా బిసిల సంక్షేమం కోసం
కృషి చేయడంతో పాటు బిసి వీరుల ఆత్మగౌరవం ప్రతిఫలించేలా స్మరించుకుంటుందన్నారు
రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్. ప్రభుత్వ ఆధ్వర్యంలో
రవీంద్రభారతిలో అంగరంగ వైభవంగా నిర్వహించిన చిట్యాల ఐలమ్మ 128వ జయంతి
వేడుకల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని, జ్యోతి ప్రజ్వలనం చేసి ఐలమ్మ
చిత్రపటానికి పూల మాల సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో
మంత్రితో పాటు టూరిజం కార్పోరేషన్ ఛైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, బిసి
కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం, సభ్యులు ఉపేంద్ర, కిషోర్, జయంతి కమిటీ ఛైర్మన్
అక్కరాజు శ్రీనివాస్ పెద్ద ఎత్తున రజక సంఘం ప్రతినిధులు, ఐలమ్మ అభిమానులు
పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ 128 ఏళ్ల క్రితం
తెలంగాణలో పోరాటాల దీవిటీ జన్మించిందని, చిట్యాల ఐలమ్మ ఏ ఒక్క కులానికో
పరిమితం చేయవద్దని, ఆమె యావత్ తెలంగాణ ఆస్థి అని కొనియాడారు మంత్రి గంగుల.
నాడే భూస్వాములకు ఎదురొడ్డి పోరాడి తన ఆత్మగౌరవం కోసం గొప్ప పోరాటం చేసారని
ఘనంగా స్మరించుకున్నారు, అంతటి వీరవనిత చరిత్ర ప్రజలకు తెలియకుండా సమైక్య
పాలకులు చేసిన కుట్రలు హేయమన్నారు. మరుగున పడ్డ చాకలి ఐలమ్మ విశిష్ట్యాన్ని
తెలిపేలా ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాటానికి స్పూర్తిగా ఐలమ్మను నిలిపారన్నారు.
120 ఏళ్ల పాటు గుర్తింపుకు నోచుకోని ఐలమ్మ జయంతి, వర్థంతి ఉత్సవాలను
అధికారికంగా నిర్వహించే జీవోను తన బిసి మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చే అవకాశం
కల్పించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి గంగుల. బిసిలు అనాదిగా
పాలకుల నిర్లక్ష్యంతో వెనుకకు నెట్టేయబడ్డారని ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి
గంగుల, ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో బిసిలకు దొరుకుతున్న సముచిత గౌరవానికి
ధన్యవాదాలు తెలిపారు. ఎకరా వందకోట్లు విలువ చేసే కోకాపేట్, ఉప్పల్ భగాయత్
లాంటి చోట్ల వేలకోట్ల విలువైన 87.3 ఎకరాలను 41 బిసి సంఘాలకు కేటాయించారని
సంతోషం వ్యక్తం చేసారు. గతంలో ఉమ్మడి పాలకులకు దరఖాస్తు ఇచ్చి దండం పెట్టినా
5గుంటల జాగా ఇవ్వలేని నాటి పరిస్థితులను సబికులకు వివరించినప్పుడు సభా
ప్రాంగణం గంభీరంగా మారిపోయింది. నాడు 19 ఉన్న బిసి గురుకులాలను 327కు పెంచి
ప్రపంచస్థాయి విద్యను అందిస్తుంటే, కులవ్రుత్తులు చేసుకొనే బిసిలు తమ బిడ్డలు
ఇంట్లో ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంటే ఉప్పొంగిపోతున్నారని, ఈ ఆనందం కోసమే సీఎం
కేసీఆర్ గారు తెలంగాణ సాధించి దిగ్విజయంగా అభివ్రుద్ది చేస్తున్నారన్నారు.
బొంబాయి, కొల్ కతా తదితర ప్రాంతాలనుండి వచ్చి అత్యాధునికంగా
దోబీనిర్వహిస్తుంటే మనవారు వెనుకబడుతున్నారని, దాన్ని పారద్రోలడానికి బిసి
కులవ్రుత్తిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయంతో ప్రోత్సాహమిస్తున్నారన్నారు.
కళ్యాణలక్ష్మీ వంటి పథకాలతో బిసిలు అప్పుల ఊబీలో చిక్కకుండా ఉన్నారని, కేసీఆర్
ప్రభుత్వం చేస్తున్న ప్రతీ సంక్షేమ కార్యక్రమంలో బిసిలకు మెజార్టీ వాటా
దక్కుతుందని అన్నారు మంత్రి గంగుల కమలాకర్. మనకోసం ఇంత చేస్తున్నవారిని
మర్చిపోకూడదని ఎన్నికల సమయంలో వచ్చి అరచేతిలో స్వర్గం చూపించేవారి మాయలో
పడకుండా, మన కడుపునింపే కేసీఆర్ గారికి ప్రతీ ఒక్కరం ఎన్నికల ద్వారా
దీవెనార్థులియ్యాలన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిసి
కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం మాట్లాడుతూ అణగారిన వర్గాలనుండి పేదరికం నుండి
వచ్చిన మంత్రి గంగుల కమలాకర్ దాన్నేప్పుడూ మర్చిపోలేదని, మూలాలను మరవకుండా
అనునిత్యం తన చుట్టూ బిసి వర్గాలను మంచిగా చూసుకుంటారన్నారు, కరీంనగర్‌ని
దేశంలోనే ఆధర్శంగా తీర్చిదిద్దుతూ నాడే ప్రతీ బిసి కులానికి స్థలాలు
కేటాయించారన్నారు. ఈ క్రుషిని గుర్తించే ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రిని
చేసారని, అది బిసి కులాల అధ్రుష్టమన్నారు. నేడు భూమికోసం, భుక్తికోసం,
విముక్తి కోసం పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మను ఘనంగా స్మరించుకొనే అవకాశం
కేవలం కేసీఆర్ గారి వల్లే దక్కిందన్నారు. సీఎం, మంత్రి క్రుషితో బిసిలు
సంఘటితం అవుతున్నారని, దాన్ని కొనసాగించానలని ఐక్యంగా ఉంటేనే గుర్తింపు
ఉంటుందన్నారు వకుళాభరణం కృష్ణమోహన్ రావు ఈ కార్యక్రమానికి ఛైర్మన్ గా
అధ్యక్షత వహించిన అక్కరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో కరీంనగర్‌లోనే
మాడ్రన్ దోబీఘాట్ల నిర్మాణానికి తొలుత చొరవ చూపిన మంత్రి గంగుల కమలాకర్ గారని
ధన్యవాదాలు తెలిపారు. చాకలి ఐలమ్మనే తెలంగాణ ఉధ్యమానికి స్పూర్తని ముఖ్యమంత్రి
గారు చెప్పిన విషయం గుర్తించుకోవాలని, కులంతో పాటు ఉద్యమానికి గుర్తింపు
తెచ్చిన చిట్యాల ఐలమ్మ జీవితాన్ని పాఠ్యాంశంలో చేర్చి గౌరవించారని, బిసిల కోసం
ముఖ్యంగా రజకుల కోసం తెలంగాణ ప్రభుత్వం 250 యూనిట్ల ఉచితకరెంట్, దోబీఘాట్లు,
ఆత్మగౌరవ భవనం తదితర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నందుకు సంతోషం వ్యక్తం
చేసారు.