హైదరాబాద్ : ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో శాసన సభ మాజీ డిప్యూటీ స్పీకర్, పరిగి
నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు కొప్పుల హరీశ్వర్ రెడ్డి భౌతిక కాయానికి
తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖా మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి గారు నివాళులు
అర్పించారు. హరీశ్వర్ రెడ్డి గారి మరణవార్త తెలిసిన వెంటనే మంత్రి శనివారం
ఉదయమే నగరం నుండి పరిగి బయలుదేరి వెళ్లారు.పరిగిలో వారి నివాసంలో సతీమణితో
గిరిజారెడ్డి గారితో పాటు కుమారులు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ని,అనిల్ రెడ్డి
లను పరామర్శించారు. హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి
వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన
హరీశ్వర్ రెడ్డి మరణం బిఅర్ఎస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లాలో సీనియర్ నేతగా జిల్లా అభివృద్ధికి కృషి చేశారని, తనకంటూ
ఒక ప్రత్యేక ముద్ర వేసారన్నారు.వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి
కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మంత్రి వెంట వికారాబాద్
జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ నాయకులు
ఉన్నారు.