లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దుయ్యబట్టారు. విశ్వగురు అనే చెప్పుకొనే
మోదీ.. 9 ఏళ్లుగా మన నీళ్ల వాటా తేల్చడం లేదని విమర్శించారు. 10 ఏళ్లుగా
కృష్ణా ట్రైబ్యునల్‌కు ఎందుకు ప్రతిపాదనలు పంపటం లేదని ప్రశ్నించారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ఇవాళ ప్రారంభించారు.
నార్లాపూర్ వద్ద తొలి పంపు స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. అనంతరం
కొల్లాపూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. బీజేపీ నేతలను
పాలమూరు జిల్లా ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు.
చేతనైతే బీజేపీ నేతలు అలా చేయండి : ఇంటిదొంగలే మనకు ప్రాణగండం తెచ్చారని
కేసీఆర్ విమర్శించారు. ‘‘పదవులకు ఆశపడి సమైక్య రాష్ట్ర సీఎంలను ఎవరూ
ప్రశ్నించలేదు. మనం ఎత్తులో ఉన్నాం నీళ్లు రావని.. ఈ జిల్లా నేతలే మాట్లాడారు.
మన నీళ్లు ఏపీకి తరలివెళ్తుంటే ఈ జిల్లా నేతలే జెండాలు ఊపారు. దత్తత తీసుకున్న
సీఎంలు కూడా ఈ జిల్లాలకు చేసిందేమీ లేదు. చేతనైతే బీజేపీ నేతలు ప్రధాని మోడీ
వద్దకు వెళ్లి నీటి వాటా అడగాలి’’ అని కోరారు. తెలంగాణను పోగొట్టింది.
కాంగ్రెస్ నేతలు కాదా? అని ప్రశ్నించారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మహబూబ్
నగర్ జిల్లాకు వైద్య కళాశాల వచ్చిందా? అని ప్రశ్నించారు.
మళ్లీ అంత సంతోషం కలిగింది : పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందినప్పుడు
ఎంత సంతోష పడ్డానో మళ్లీ ఇవాళ పాలమూరు గడ్డపై కృష్ణా జలాలు పారుతుంటే అంత
సంతోషం కలిగిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక
మొట్టమొదట విద్యుత్ సమస్యపై దృష్టి పెట్టి అధిగమించినట్లు తెలిపారు. ఆ తర్వాత
పింఛన్లు క్రమంగా పెంచుకుంటూ పోతున్నామన్నారు. తమిళనాడు పాఠశాలల్లో
విద్యార్థులకు అల్పాహారం పెడుతున్నారని.. ఆ పథకం బాగుందని తెలంగాణలోనూ అమలు
చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
కొల్లాపూర్‌పై వరాల జల్లు : మరోవైపు కొల్లాపూర్‌పై ముఖ్యమంత్రి వరాలు జల్లు
కురిపించారు. కొల్లాపూర్ అభివృద్ధికి రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు
ప్రకటించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రూ.15 లక్షలు
ప్రత్యేక నిధులు ఇస్తామన్నారు. అలాగే కొల్లాపూర్‌కు పాలిటెక్నిక్ కళాశాల
మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.