మహిళా సాధికారతలో మనమే నెంబర్ వన్
మహిళా పథకాలలో, ప్రగతిలో మన రాష్ట్రమే దేశానికి ఆదర్శం
డ్వాక్రా సంఘాల పొదుపు, నిర్వహణ, శిక్షణలో మనమే మేటి
ఎన్టీఆర్ మహిళా సంఘాలను పెట్టి ప్రోత్సహిస్తే, వాటిని బలోపేతం చేసింది
సీఎం కెసిఆరే
ఒరిస్సా, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ లలో నెల రోజులపాటు లోకొస్ అనే మొబైల్ యాప్
పై శిక్షణ ఇవ్వడానికి వెళ్లిన మహిళలతో మంత్రి ఎర్రబెల్లి మమేకం
వరంగల్/హనుమకొండ : డ్వాక్రా సంఘాల నిర్వహణలో మీ పని తీరు అద్భుతంగా
ఉంది. మీ అనుభవాలను, నిర్వహణా సామర్ధ్యాలను కలిపి, దేశంలోని మిగతా
మహిళా సంఘాలకు ఇస్తున్న శిక్షణ గొప్పగా ఉంది. దేశానికే ఆదర్శంగా నిలిచిన
మహిళా మణులందరికీ అభినందనలు… మీరు తాజాగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల
అభ్యర్థన మేరకు ఒరిస్సా, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు వెళుతున్నారు.
లోకోస్ అనే మొబైల్ యాప్ పై మీరిచ్చే శిక్షణ మన అనుభవాలకు గీటు రాయి. మీ సత్తా
చాట0డి. మన వైభవాన్ని, మహిళా సాధికారత లో మన ఘనతను అక్కడి ప్రజలకు కూడా
చెప్పండి అని ఆయన అన్నారు. ఆ 3 రాష్ట్రాలకు కలిపి వెళుతున్న 58 మంది మహిళలతో
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మమేకం అయ్యారు. పేదరిక నిర్మూలన సంస్థ
ఓరుగల్లు మహా సమాఖ్య కు చెందిన 58 మంది మహిళలతో మంత్రి హనుమకొండలోని
తన క్యాంపు కార్యాలయం ఆర్ అండ్ బి అతిథి గృహంలో ముఖా ముఖి అయ్యారు. వారితో
గంటన్నరపాటు చర్చించారు. సాధించిన ప్రగతిని చూశారు. వారి అనుభవాలను
అడిగి తెలుసుకున్నారు. వారు శిక్షణ ఇస్తున్న తీరు తెన్నులను అడిగారు. వారికి
ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. ఏండ్లుగా వారు నిర్వహిస్తున్న
శిక్షణ పద్ధతులను కూడా తెలుసుకున్నారు. వారిని శభాష్! మీ పని తీరు
బాగుంది. మీరు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారంటూ అభినందించారు.
అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, అప్పట్లో ఎన్టీ
రామారావు డ్వాక్రా సంఘాలను పెట్టారు. వాటిని సీఎం కెసిఆర్ బలోపేతం చేశారు.
అప్పట్లో అతి కొద్ది మొత్తం పొదుపు చేయడంతో ప్రారంభమై ఇవ్వాళ పేదరిక
నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో 4,35,364 స్వయం సహాయక సంఘాలలో 45,60,518 మంది
మహిళలు సభ్యులుగా ఉన్నారన్నారు. దేశంలోనే ఇంత పెద్ద ఎత్తున సంఘటితమైన
మహిళలు తెలంగాణలో తప్ప ఎక్కడా లేరన్నారు. మహిళలు బాగుపడితే, ఆ
కుటుంబం, సమాజం, గ్రామం, రాష్ట్రం, దేశం బాగుపడుతుందని తెలిపారు. అందుకే
సిఎం కెసిఆర్ డ్వాక్రా సంఘాలను బలోపేతం చేస్తున్నారని తెలిపారు. అనేక
రుణాలు ఇప్పిస్తూ, మహిళలను పారిశ్రామికంగా ఎదిగేవిధంగా చేస్తున్నారు. అనేక
పథకాలను మహిళల పేరునే, వారికే వర్తించే విధంగా చర్యలు తీసుకున్నారు.
అందుకే ఇవ్వాళ మన మహిళా సంఘాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని మంత్రి
వివరించారు. మహిళా సంఘాలు, అలాగే ఓరుగల్లు మహిళా సమాఖ్య ఇదే పని తీరును
కొనసాగిస్తూ, ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ
కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతోపాటు పరకాల ఎమ్మెల్యే చల్లా
ధర్మా రెడ్డి, వరంగల్ జెడ్పీ ఇన్ చార్జీ సిఇఓ, వరంగల్ డిఆర్ డిఓ సంపత్
రావు, హనుమకొండ జిల్లా డి అర్ డి ఓ శ్రీనివాస్ కుమార్, ఎర్రబెల్లి ట్రస్టు కో
ఆర్డినేటర్ పంజా కల్పన, సెర్ప్ కు చెందిన తక్కెళ్ళపల్లి రవిందర్ రావు,
ఓరుగల్లు మహా సమాఖ్య కు చెందిన మహిళలు, రిసోర్స్ పర్సన్స్, సీనియర్
కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్, రాష్ట్ర స్థాయి కమ్యూనిటీ ట్రైనర్స్,
ప్రొఫెషనల్ రిసోర్స్ పర్సన్స్, ఎలక్ట్రానిక్ మాస్టర్ ట్రైనర్స్
తదితరులు పాల్గొన్నారు.