13దేశాలకు చెందిన 30 మంది ప్రతినిధులు మల్లన్న సాగర్ ప్రాజెక్టును
సందర్శించారు. ప్రాజెక్టులోని పంప్ హౌస్, డెలివరీ చానల్ లను, మల్లన్న సాగర్
కట్టను పరిశీలించారు. భూగర్భంలో ఇంత పెద్ద కట్టడం పట్ల వారు
ఆశ్చర్యచకితులయ్యారు. “ఈ సందర్భంగా డీఈ శ్రీనివాస్ వారికి ప్రాజెక్టు
విశేషాలను వివరించారు. తెలంగాణ రాష్ట్రం లో మెత్తం 1 కోటి 72 లక్షల ఎకరాల భూమి
సాగుకు అనుకూలంగా ఉండగా, 2014-15 సమయంలో కేవలం 45 లక్షల ఎకరాల సాగు మాత్రమే
జరిగేదని తెలిపారు. వ్యవసాయాభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద
పీఠ వేశారు. గోదావరిపై ఇతర రాష్ట్రాలలో ఎక్కువ ప్రాజెక్టులు నిర్మించడంతో
గడచిన 40 ఏండ్లలో అనుకున్నంత నీటి లభ్యత లేకపోవడంతో ప్రాణహిత గోదావరిలో కలిసే
ప్రాంతంలో మేటిగడ్డ వద్ద నీటి లభ్యత” ఎక్కువ శాతం ఉండటంతో అక్కడ కాళేశ్వరం
ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. అక్కడి నుండి 200 కిలోమీటర్ల
దూరంకు, 88 మీటర్ల ఎత్తు నుండి 610 మీ ఎత్తుకు 10 లిఫ్టులు, రిజర్వాయర్లు,
పంప్ హౌస్స్ ల ద్వారా మల్లన్న సాగర్ నీటిని ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా
తీసుకురావడం జరిగిందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 46500 చెరువులను మిషన్
కాకతీయ పథకం ద్వారా పునరుద్ధరించుకోవడం జరిగిందన్నారు. గతంలో 45 లక్షల ఎకరాలు
సాగైతే, నేడు కోటి ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. ప్రకృతి
ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 273 కోట్ల మొక్కలను
హరితహారంలో భాగంగా నాటడం జరిగిందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు సకాలంలో
వర్షాలు కురియడంతో తెలంగాణ భూగర్భ జలాలు 2014లో 78 ఫీట్ల లోతులో ఉంటే, నేడు 36
ఫీట్లకు చేరుకున్నాయన్నారు. గతంలో 50 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి
నుండి నేడు 2కోట్ల 60 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యంకు
చేరుకుందన్నారు.దీనితో దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని
అన్నారు.
గతంలో తెలంగాణ ప్రజలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెలితే, నేడు ఇతర ప్రాంతాల
నుండి తెలంగాణకు కూలీలు వలస వస్తున్నారని పేర్కొన్నారు. ఫ్లోరోసిస్ ప్రభావం
ఉన్న నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ అంతటా మిషన్ భగీరథ ద్వారా ఈ ప్రాజెక్టు
నుండి మంచినీటిని అందించడం జరుగుతుందన్నారు. 50 ఏళ్ల వరకు హైదరాబాద్ కు
పుష్కలంగా మంచినీళ్లు అందించడం జరుగుతుందని, పరిశ్రమలకు నీళ్లను
అందిస్తున్నారన్నారు. కేంద్రంలోని నీతి ఆయోగ్ కమిటీ కూడా తెలంగాణలో 2014లో
13.16 ఉన్న పేదరికం నేడు 5.8 శాతంకు తగ్గిందని తెలిపారు. ఈసందర్భంగా
ఎత్తిపోతల ద్వారా పంట పొలాలకు సాగు నీరు అందించే కార్యక్రమం తెలంగాణలో మాత్రమే
జరుగుతుందని సందర్శకులు సీఎం కేసీఆర్ చేసిన కృషిని కొనియాడారు. తెలంగాణ లో
జరిగిన అభివృద్ధిని చూసి వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు
స్లోగన్లతో సంతోషం వ్యక్తం చేశారు.