హైదరాబాద్ : కొలువుల కోసం తెలంగాణ తెచ్చుకున్న నిరుద్యోగులను కొట్టే హక్కు
నీకెక్కడిది? అని సీఎం కేసీఆర్ని వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు
వైఎస్ షర్మిలరెడ్డి ప్రశ్నించారు. టీచర్ అభ్యర్థులపై కేసీఆర్ ప్రభుత్వం
లాఠీఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మంగళవారం లోటస్పాండ్ వేదికగా ఆమె
మీడియాతో మాట్లాడుతూ ‘‘అసెంబ్లీలో ఇచ్చిన వాగ్ధానం ప్రకారం 13086 టీచర్
పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తే లాఠీలతో కొడతారా? సిగ్గుందా కేసీఆర్?
నిండు అసెంబ్లీలో ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోవా? ఎన్నికల ముందు కూడా మాట మీద
నిలబడవా? ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా యువత రక్తాన్ని కళ్లారా చూస్తావా? నీ
కుటుంబానికి ఐదు ఉద్యోగాలుంటే సరిపోతుందా?13096 టీచర్ పోస్టులకు కేవలం 5 వేలు
బిక్షం వేస్తావా? తొమ్మిదేళ్లుగా టీచర్ పోస్టుల ఊసే ఎత్తకుండా నామమాత్రంగా
పోస్టులు భర్తీ చేసి, ఓట్లు దండుకుందామనా? మాట తప్పితే తల నరుక్కునే నైజమే
అయితే? నరం మీద నాలుకే ఉంటే 13086 టీచర్ పోస్టులకు కేసీఆర్ వెంటనే నోటిఫికేషన్
ఇవ్వాలి. డీఎడ్,బీఎడ్ అభ్యర్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని తీవ్ర ఆగ్రహం
వ్యక్తం చేశారు.