రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రకటించే హామీలన్నీ ఆచరణ సాధ్యం కానివని రాష్ట్ర
పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గోషామహల్లో బీసీ
కులవృత్తిదారులకు ఆర్థిక సహాయం పంపిణీతో పాటు పలు అభివృద్ధి పనులను స్థానిక
ఎమ్మెల్యే రాజాసింగ్, కార్పొరేటర్లతో కలిసి మంత్రి తలసాని ప్రారంభించారు.
కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఓట్లను దండుకొనే లక్ష్యంతో అవగాహన లేకుండా హామీలు
ప్రకటిస్తున్నారని మండిపడ్డారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ను నమ్మే
స్థితిలో ప్రజలు లేరన్నారు.