లబ్ధిదారులకు అందజేస్తాం
ప్రభుత్వం బడుగు బలహీన, మైనార్టీ వర్గాల కోసం పనిచేస్తోంది
హైదరాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టితో మంత్రి తలసాని
శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ మనోహర్ రెడ్డి, మేయర్ గద్వాల్
విజయ లక్ష్మి, జీహెచ్ ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ సమావేశం
హైదరాబాద్ : ప్రభుత్వం పారదర్శకంగా లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు
అందజేజేస్తుందని, ఎవరు దళారులను నమ్మొదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
అన్నారు. గురువారం హైదరాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టితో
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ మనోహర్ రెడ్డి,
మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, జీహెచ్ ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ సమావేశం
అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ.. ‘‘దేశంలో ఎక్కడా
లేని విధంగా నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను ముఖ్యమంత్రి కేసీఆర్
ఇస్తున్నారు. పేదవారు సంతోషంగా జీవించాలని సీఎం రూపొందించారు. డబుల్ ఇళ్లకు కు
కేంద్ర ప్రభుత్వం 1.5లక్షలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 8లక్షలు రూపాయలు
ఇస్తుంది. ప్రతిపక్షాలు ‘డబుల్’ పై అనవసరపు రాద్ధాంతాం చేస్తున్నారన్నారు.
వచ్చే నెల 2వ తేదీన హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 500 చొప్పున
లబ్ధిదారులకు అందజేస్తాం. 12వేల మంది లబ్ధిదారులకు మొదటగా ఇస్తాం. హైదరాబాద్
సిటీలో ఒక ఇంట్లోనే 10మంది దరాఖాస్తు చేసుకున్నారు. అన్ని పరిశీలించిన
తర్వాతనే పారదర్శకంగా అందిజేస్తాము. బంజారాహిల్స్, కొకపేట్ లాంటి ప్రాంతాలల్లో
కూడా డబుల్ ఇళ్లు కట్టాం. పేదలు కూడా ఇలాంటి ప్రాంతాలల్లో జీవించాలని
ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం. రానున్న రోజుల్లో నిరంతరంగా ఈ ప్రక్రియ
కొనసాగిస్తాం. మా ప్రభుత్వం బడుగు బలహీన, మైనార్టీ వర్గాల కోసం
పనిచేస్తోంది’ని మంత్రి తలసాని పేర్కొన్నారు.
ఎలాంటి అవకతవకలు లేకుండా ఇస్తాం : కలెక్టర్ అనుదీప్
డబుల్ ఇళ్లలో లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తున్నాం. 15నియోజకవర్గాల్లో
లబ్ధిదారులకు లాండం పద్ధతిలో డబుల్ ఇళ్లను అందజేస్తాం. ముఖ్యమంత్రి కేసీఆర్
ఆదేశాలతో ఎలాంటి అవకతవకలు లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని హైదరాబాద్
కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి తెలిపారు.