సేవలు
ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీకి ఓటు వేయాలి
డబుల్ బెడ్రూం ఇళ్లు, నిరుద్యోగ భృతి, ఉద్యోగ కల్పనలో ప్రభుత్వం విఫలం
మాజీ మంత్రి, బీజేపీ ఎన్నికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్
హైదరాబాద్ : మద్యం అమ్మకాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానాన్ని
దక్కించుకుందని మాజీ మంత్రి, బీజేపీ ఎన్నికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్
ఎద్దేవా చేశారు. వాడవాడలా మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు
కలకలలాడుతున్నాయన్నారు. కూకట్పల్లిలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
వడ్డేపల్లి రాజేశ్వరరావు తలపెట్టిన ఇంటింటికి భాజపా పాదయాత్ర 50 రోజులకు
చేరగా, ఇవాళ ఈటల ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారాస పాలనపై
విమర్శలు గుప్పించారు. ఎన్నికల హామీలైన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, నిరుద్యోగ
భృతి, ఉద్యోగాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో
విఫలమైందన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఒక్క రూపాయి ఖర్చు
లేకుండా వైద్య సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర
అభివృద్ధి కోసం రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని ప్రజలను ఈటల
విజ్ఞప్తి చేశారు.