జగిత్యాల : ఐదు దశాబ్దాల పాటు దేశ ప్రజలను కాంగ్రెస్ రాచి రంపాన పెట్టిందని
మంత్రి కేటీఆర్ విమర్శించారు. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ నివాసంలో ఆయన
మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి మాటలు అవగాహనా రాహిత్యానికి
నిదర్శనమన్నారు. రైతులపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని
డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు కరెంటు, విత్తనాలు ఇవ్వలేని
పరిస్థితి ఉండేదన్నారు. విత్తనాలు, ఎరువుల కోసం చెప్పుల్ని లైన్లో పెట్టి
నిల్చున్నది నిజం కాదా?అని ప్రశ్నించారు. ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిదేళ్ల
పాలనలో రైతుల పరిస్థితి మారిపోయింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రైతుల్ని
రాజుగా చేసిన పార్టీ భారాస మాత్రమే. మూడెకరాలున్న రైతులకు 3 గంటల విద్యుత్
చాలన్న రేవంత్ రెడ్డి మాటలు పార్టీ మాటలు కాదా? కేసీఆర్‌ది 3 పంటల నినాదమైతే
కాంగ్రెస్‌ది మూడు గంటల నినాదం.’’ అని కేటీఆర్ మండిపడ్డారు. ప్రజలు..
రైతుబంధు తీసుకొచ్చిన కేసీఆర్‌ను విశ్వసిస్తారా లేదా కాంగ్రెస్‌ని నమ్ముతారా?
అని కేటీఆర్ ప్రశ్నించారు. గతంలో ఏ చెరువులనైనా నింపిన చరిత్ర కాంగ్రెస్‌కు
ఉందా? అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని
రాహుల్‌గాంధీ అంటున్నారని, అదెలా జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రేపటి
నుంచి రైతు వేదికలో ‘కాంగ్రెస్ పార్టీ కటిక చీటక్ల పాలన వద్దు’ అని తీర్మానం
చేస్తామన్నారు. ఉచిత కరెంటు మీద మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్న
కేటీఆర్ ఇప్పుడున్నది రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్ కాదని, చంద్రబాబు
కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. మహారాష్ట్ర రైతులు కూడా కేసీఆర్ పాలనను
మెచ్చుకుంటున్నారు. రేవంత్ రెడ్డి అర్ఎస్ఎస్ నుంచి వచ్చిన కార్యకర్త.
ఆర్ఎస్ఎస్ ఎజెంట్. రేవంత్‌రెడ్డి ఏనాడూ మోదీని ప్రశ్నించలేదు. రేవంత్
పూర్వాశ్రమం అంతా ఆర్ఎస్ఎస్దే. ఎమ్మెల్యేలని కొనడంలో రేవంత్ సిద్ధహస్తుడు.
గాంధీభవన్‌లో గాడ్సే రేవంత్‌రెడ్డి అని కేటీఆర్ అన్నారు. హిమాన్షు మాట్లాడిన
మాటల్లో తప్పులేదని, ప్రతి పాఠశాలని కేసీఆర్ ప్రభుత్వమే బాగు చేస్తుందన్నారు.