మెరుగుపడనున్న పనితీరు
హైదరాబాద్ : రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖను భారీగా పునర్
వ్యవస్థీకరణకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది . ఈ మేరకు గత ఆరు నెలలుగా
జరుగుతున్న కసరత్తుకు మంగళవారం జారీ చేసిన జీవోతో కొలిక్కి వచ్చినట్లయింది .
కొత్తగా 87 కార్యాలయాలు మంజూరు చేస్తూ సర్కారు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు
పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా
మంగళవారం జీవో 18 విడుదల చేశారు . అలాగే ఆయా హోదాల్లో ఉన్న ఇంజినీర్లకు
అధికారాల బదలాయింపు సైతం చేశారు . దీనికోసం మరో జీవో నెంబరు 19 జారీ అయింది .
దీంతో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ మరింత చురుగ్గా పనిచేసేందుకు అవకాశం
కలుగుతున్నది. రాష్ట్ర విద్యుత్ , ఆర్ అండ్ బీ , సాగునీటి పారుదల శాఖ తరహాలోనే
పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖను బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ భావించారు.
ఈమేరకు ప్రతిపాదనలను పంపాలని గత ఏడాది నవంబరులో ఇంజినీర్ ఇన్ చీఫ్ ఏజ్
సంజీవరావను ఆదేశించారు. దీంతో ఈఎన్సీ తన శాఖలో పని, ప్రస్తుతం ఉన్న పోస్టులు,
అదనపు కావాల్సిన పోస్టులతో సమగ్రంగా నివేదిక పంపారు. దీన్ని మంత్రివర్గ
సమావేశంలో చర్చించి కొన్ని మార్పులతో పున ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఈ
బాధ్యతను ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు , పంచాయతీరాజ్ శాఖ ఎర్రబెల్లి
దయాకర్‌రావుకు అప్పగించారు . ఆయా దశలు , స్థాయిల్లో సంప్రదింపులు అనంతరం పంపిన
ప్రతిపాదలను తాజాగా చర్చించి ఆమోదముద్రవేశారు . ఆ మేరకు మంగళవారం జీవోలు
విడుదల అయ్యాయి . ఈనేపథ్యంలో కిందిస్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో క్యాల్లో
భారీ మార్పులు రానున్నాయి . దీంతో ఆ శాఖ పనితీరు మరింత మెరుగుపడనుంది .
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన ప్రకారం కొత్తగా నాలుగు చీఫ్
ఇంజినీర్ , 12 సర్కిల్ ఇంజినీర్ కార్యాలయాలు , 11 డివిజనల్ ఇంజినీర్
కార్యాలయాలు , 60 సబ్ డివిజినల్ కార్యాలయాలు , ఇంజినీర్ పోస్టులను మంజూరు
చేసింది . వివిధ స్థాయిల్లో ఇంజినీర్లకు పనులు మంజూరు చేసే అధికారం
కల్పించింది . డీఈఈకి ఏడాదికి రూ . 5 లక్షలు , ఈఈకి ఏడాదికి రూ . 25 లక్షలు ,
ఎస్ఈకి రూ . కోటి సీఈకి రూ .2.5 కోట్లు , ఈఎన్సీకి రూ. 5 కోట్ల వరకు పరిపాలన
అనుమతులు ఇచ్చే అధికారం కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా
పీఆర్ ఇంజినీరింగ్ శాఖలో సంబరాలు నిర్వహించారు. అన్ని జిల్లాల్లో ఇవి జరిగాయి.
సీఎంకు కృతజ్ఞతలు : ఏ.జీ. సంజీవరావు , ఈఎన్సీ
పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖకు భారీగా పోస్టులు మంజూరు చేసినందుకు ఈఎన్సీ
సంజీవరావు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు కృతజ్ఞతలు తెలియజేశారు . రాష్ట్రంలో
రోడ్ల నిర్వహణ మరింత మెరుగ్గా నిర్వహించి సీఎం నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని
చెప్పారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ లో ఉన్న వీఆర్ ఇంజినీరింగ్ శాఖ ప్రధాన
కార్యాలయంలో ఇంజినీర్లు , ఉద్యోగులు సంబరాలు నిర్వహించారు . ఈ కార్యక్రమంలో
పాల్గొన్న ఈ ఎన్నీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పోస్టులు మంజూరయ్యాయని
చెప్పారు. నేను ఈఎస్పీగా ఉన్నప్పుడు శాఖను పూర్తిస్థాయిలో పున వ్యవస్థీకరణ
చేయడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇందుకు సహకరించిన మంత్రులు హరీశరావు ,
దయాకర్ రావు , ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుబ్బాసియా ప్రభుత్వ
ప్రధానకార్యదర్శి ఎ శాంతకుమారి , ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు
, సుల్తానీయా , సీఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్ తదితరులకు దన్యవాదాలు
తెలియజేశారు.
కార్యాలయంలో ఇంజినీర్లు ఉద్యోగులు టపాసులు పెట్టారు . అనంతరం స్వీట్లు
పంచారు. ఈ కార్యక్రమంలో సీఈ జి. సీతారాములు , ఎస్ ఈ లు ఎం. ఆశోక్ , ఎం.
సురేశ్వంద్రారెడ్డి , ఈఈలు డి. రమేశ్ చందర్ , వి. శ్రీహరి , ఎ.టీ.ఎం.ఎ. ముజీబ్
, అబ్బు శ్రీనివాస్ , జి. నరేంద్ర ప్రసాద్ , పీ. చంద్ర మౌలి , ఎం. భూమన్న ,
సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు .