రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలో ఉత్సవాల రోజువారీ కార్యక్రమాల
షెడ్యూల్ ను ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సెక్రటేరియట్ లోని తన
ఛాంబర్ లో ఈరోజు జరిగిన సమీక్షా సమావేశంలో ఖరారు చేశారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల రోజువారీ షెడ్యూల్:
• జూన్ 2
‘‘తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల’’ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు
గారు ప్రారంభిస్తారు. జూన్ 2న హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద గల అమరవీరుల
స్థూపం వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ
రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో సీఎం జాతీయ పతాకావిష్కరణ జరుపుతారు. అనంతరం
దశాబ్ది ఉత్సవ సందేశాన్నిస్తారు. అదే రోజున రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో
మంత్రుల ఆధ్వర్యంలో జాతీయ పతాక వందనం, దశాబ్ది ఉత్సవ సందేశాలు తదితర
కార్యక్రమాలుంటాయి.
• జూన్ 3
జూన్ 3 శనివారం నాడు ‘‘తెలంగాణ రైతు దినోత్సవంగా” జరుపుతారు.
• జూన్ 4
జూన్ 4వ తేదీ ఆదివారం పోలీసుశాఖ ఆధ్వర్యంలో ‘‘సురక్షా దినోత్సవం’’
నిర్వహిస్తారు.
• జూన్ 5
జూన్ 5వ తేదీ సోమవారం నాడు ‘‘తెలంగాణ విద్యుత్తు విజయోత్సవం’’ జరుపుతారు.
• జూన్ 6
జూన్ 6వ తేదీ మంగళవారం ‘‘తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం’’ జరుగుతుంది.
• జూన్ 7
జూన్ 7వ తేదీ బుధవారం ‘‘సాగునీటి దినోత్సవం’’ నిర్వహిస్తారు.
• జూన్ 8
జూన్ 8వ తేదీ గురువారం ‘‘ఊరూరా చెరువుల పండుగ’’ నిర్వహిస్తారు.
• జూన్ 9
జూన్ 9 శుక్రవారం రోజున ‘‘తెలంగాణ సంక్షేమ సంబురాలు’’ జరుపుతారు.
• జూన్ 10
జూన్ 10వ తేదీ, శనివారం ‘‘తెలంగాణ సుపరిపాలన దినోత్సవం’’ జరుపుతారు.
• జూన్ 11
జూన్ 11వ తేదీ, ఆదివారం నాడు ‘‘తెలంగాణ సాహిత్య దినోత్సవం’’ నిర్వహిస్తారు.
• జూన్ 12
జూన్ 12వ తేదీ సోమవారం ‘‘తెలంగాణ రన్’’ నిర్వహిస్తారు.
• జూన్ 13
జూన్ 13 మంగళవారం ‘‘తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం’’ నిర్వహిస్తారు.
• జూన్ 14
జూన్ 14వ తేదీ బుధవారం ‘‘తెలంగాణ వైద్యారోగ్య దినోత్సవా’’న్ని ఘనంగా
నిర్వహిస్తారు.
• జూన్ 15
జూన్ 15 గురువారం ‘‘తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం’’ జరుపుతారు.
• జూన్ 16
జూన్ 16వ తేదీ శుక్రవారం ‘‘తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం’’ నిర్వహిస్తారు.
• జూన్ 17
జూన్ 17వ తేదీ శనివారం ‘‘తెలంగాణ గిరిజనోత్సవం’’ జరుపుతారు.
• జూన్ 18
జూన్ 18వ తేదీన ఆదివారంనాడు ‘‘తెలంగాణ మంచి నీళ్ల పండుగ’’ నిర్వహిస్తారు.
• జూన్ 19
జూన్ 19వ తేదీ సోమవారం ‘‘తెలంగాణ హరితోత్సవం’’ ఉంటుంది.
• జూన్ 20
జూన్ 20వ తేదీ మంగళవారం ‘‘తెలంగాణ విద్యాదినోత్సవం’’ నిర్వహిస్తారు.
• జూన్ 21
జూన్ 21వ తేదీ బుధవారం ‘‘తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం’’ నిర్వహిస్తారు.
• జూన్ 22
జూన్ 22వ తేదీ గురువారం ‘‘అమరుల సంస్మరణ’’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.