యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలి
ముఖ్యమంత్రి కేసీఅర్ సంకల్పం మేరకే సి యం 2023 కప్
నల్లగొండలో సి యం 2023 కప్ పోటీలు ప్రారంభం
ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి
పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్
బండ నరేందర్ రెడ్డి, శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, భాస్కర్ రావు,
మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి
నల్గొండ : క్రీడలతో మానసిక రుగ్మతలకు చెక్ పెట్టవచ్చని రాష్ట్ర విద్యుత్
శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కన్నారు. విద్యార్థులు కేవలం చదువుకే
పరిమితం కాకూడదని, చదువుతో పాటు విద్య కు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన
విద్యార్థులకు ఉద్బోధించారు. నల్లగొండ జిల్లా కేంద్రం లోని మేకల అభినవ
స్టేడియంలో సోమవారం రోజున సి యం కప్ 2023 పోటీలను రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి
గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రారంభించారు. నల్లగొండ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్
బండా నరేందర్ రెడ్డి,రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, శాసనసభ్యులు
కంచర్ల భూపాల్ రెడ్డి, భాస్కర్ రావు లతో పాటు స్థానిక మున్సిపల్ చైర్మన్ మందడి
సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అఖండ జ్యోతిని వెలిగించడంతో పాటు బెలూన్ లను గాలిలోకి వదిలి క్రీడలను
ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి తానే స్వయంగా క్రీడాకారులతో పోటీ పడి ఆడి
క్రీడా కారులకు ఉత్సాహాన్ని నింపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత లో క్రీడా
స్ఫూర్తిని పెంపొందించాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఅర్ సంకల్పం అన్నారు. అందులో
భాగమే సి యం కప్ 2023 పోటీలని ఆయన వెల్లడించారు.