ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి నేడూ విచారణకు హాజరుకాలేదు. తన తల్లి
శ్రీలక్ష్మి అనారోగ్య కారణాల దృష్ట్యా విచారణకు రాలేనని పేర్కొంటూ సీబీఐకు ఆయన
లేఖ రాశారు. ఈ మేరకు లిఖిత పూర్వకంగా సమాచారం ఇచ్చేందుకు ఎంపీ తరఫు
న్యాయవాదులు సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. తన తల్లికి గుండెపోటు రావడంతో
ఆమెను పులివెందులలోని ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రిలో చేర్చినట్లు లేఖలో అవినాష్
పేర్కొన్నారు. సీబీఐ విచారణకు అవినాష్‌రెడ్డి చివరి నిమిషంలో గైర్హాజరు కావడం
వరుసగా ఇది రెండోసారి. ఈనెల 16న ఆయన విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ
ముందస్తు కార్యక్రమాలను కారణంగా చూపుతూ హైదరాబాద్ నుంచి కడప వెళ్లిపోయారు.
దీంతో సీబీఐ బృందం కూడా అంతేవేగంగా కడప చేరుకోవడం, అవినాష్‌రెడ్డి ఇంట్లో
లేకపోవడంతో ఈ నెల 19న(నేడు) విచారణకు రావాలంటూ డ్రైవర్‌కు నోటీస్ ఇవ్వడం
ఉత్కంఠ రేపింది. తాజాగా విచారణ కోసం పులివెందుల నుంచి హైదరాబాద్ చేరుకున్న
అవినాష్ మళ్లీ చివరి నిమిషంలో సీబీఐకి లేఖ రాస్తూ తన తల్లి అనారోగ్య కారణాల
రీత్యా విచారణకు రాలేనని పేర్కొన్నారు. అనంతరం తిరిగి ఆయన పులివెందులకు
బయల్దేరారు.
మార్గంమధ్యలో సమాచారం వచ్చింది : అవినాష్ తరఫు న్యాయవాది
శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని తన ఇంటి నుంచి సీబీఐ కార్యాలయానికి
అవినాష్‌రెడ్డి బయల్దేరారని, మార్గంమధ్యలో తల్లి ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం
వచ్చిందని ఆయన తరఫు న్యాయవాది మల్లారెడ్డి తెలిపారు. అవినాష్ తల్లి
గుండెపోటుతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం వచ్చిందని చెప్పారు.
దీంతో వెంటనే ఆయన పులివెందుల బయల్దేరినట్లు తెలిపారు. దీనిపై సీబీఐకి లిఖిత
పూర్వకంగా సమాచారం ఇస్తామని, వాళ్లు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఎలా
ముందుకెళ్లాలనేది తాము ఆలోచిస్తామన్నారు. తండ్రి భాస్కర్‌రెడ్ది జైల్లో
ఉన్నందున తల్లిని అవినాష్‌రెడ్డే చూసుకోవాల్సి ఉందని న్యాయవాది చెప్పారు.