విజయవాడ : రాష్ట్రంలోని స్టార్టప్ లన్నింటికి ఒకే చోట అన్ని పరిష్కారాలు
లభించేలా ఏపీ స్టార్టప్ డాట్ ఇన్ పేరుతో ప్రత్యేకంగా ఒక పోర్టల్ ఏర్పాటు
చేయ్యడమే కాకుండా వాటికి అవసరమైన నిధులను సమకూర్చేవిధంగా ఇన్నొవేషన్ ఫండ్ ను
ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని రాజ్యసభ సభ్యులు,వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన
కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా పలు
అంశాలపై స్పందించారు. ప్రారంభంలో రూ.200 కొట్ల నిధులతో స్టార్టప్ లకు ఆర్థిక
సాయం అందిచనున్నారని తెలిపారు.విశాఖలో ఏడు స్టార్టప్ లకు సాయానికి
సంప్రదింపులు చేసినట్టు ఆయన చెప్పారు.
వైఎస్సార్ మత్స్యకార భరోసా
రాష్ట్ర వ్యాప్తంగా సముద్రంపై వేటకు వెళ్లే 1,23,519 మత్స్యకార కుటుంబాలకు వేట
నిషేధ సమయం అయిన ఏఫ్రిల్ 15 నుంచి జూన్ 14 మధ్య కాలంలో ఆ కుటుంబాలు ఇబ్బంది
పడకూడదని ఒక్కొక్క కుటుంబానికి రూ.10వేలు చొప్పున రూ.123.52 కోట్ల ఆర్ధిక
సాయాన్ని ముఖ్యమంత్రి జగన్ మొహన్ రెడ్డి మంగళవారం విడుదల చేశారని చెప్పారు.
అత్యధిక మహిళా పోలీసులున్న రాష్ట్రం ఏపీ
ఆంధ్రప్రదేవ్ దేశంలోనే అత్యధిక మహిళా పోలీసులున్న రాష్ట్రంగా నిలిచిందని ఆయన
అన్నారు.జాతీయ స్థాయిలో 11.75 శాతం మహిళా పోలీసులుంటే ఏపీలో అది 21.76%. ఇవి
కేంద్ర హోంశాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయని చెప్పారు. మహిళా సాధికారితలోనూ
దేశంలో మనమే నంబర్ వన్ నిలిచామని చెప్పారు.
సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి
భారతదేశంలో వ్యవసాయ విధానంలో సానుకూల మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని,
సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఆయన అన్నారు. రసాయనిక ఎరువులు,
పురుగుమందుల అనవసర వినియోగాన్ని నివారించాలని కొరారు. ఆరోగ్యకరమైన మరియు
లాభదాయకమైన వ్యవసాయ పద్ధతుల పునరుద్ధరణ దిశగా వ్యవసాయ మంత్రిత్వ శాఖ చొరవ
తీసుకోవాలని కోరారు.గత 3-4 దశాబ్దాల్లో ఆహార పదార్థాల్లో పోషకాలు తగ్గుముఖం
పట్టడం ఆందోళన కలిగిస్తోంది. మాంసకృత్తులు, కాల్షియం, భాస్వరం, రిబోఫ్లావిన్
మరియు విటమిన్ సి ఇప్పుడు తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలలో అందుబాటులో లేవని
శాస్త్రీయ అధ్యయనాలు చూపించాయన్నారు.