జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం హైదరాబాద్ లోని తన నివాసంలో
ఆవిష్కరించారు. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీ కృష్ణ దేవరాయల ప్రేమ
కథ పై రచయిత నాగలాదేవి అనే ఈ పుస్తకాన్ని తీసుకువచ్చారు. తిరుపతికి సమీపంలోని
నాగలాపురం గ్రామానికి చెందిన నాగలాదేవిని శ్రీ కృష్ణ దేవరాయల ప్రేమించి వివాహం
చేసుకున్నారు. పెళ్లి అయిన తరువాత నాగలాదేవి పేరును చిన్నా దేవి అని
మారుస్తారు. కానీ చరిత్రలో నాగలాదేవి వేరు, చిన్నాదేవి వేరు అనే చర్చ, వాదన
ఉంది. కానీ ఇద్దరు వేరు కాదు..ఒకటే అని పుస్తకంలో రచయిత పేర్కొన్నారు. దాదాపు
16 ఏళ్ల పరిశోధన చేసి నాగలాదేవి పుస్తకాన్ని తీసుకువచ్చిన భగీరథను చంద్రబాబు
నాయుడు అభినందించారు. రాజ్య పాలనలో నాగలాదేవి శ్రీ కృష్ణ దేవరాయలకు ఎలా
సహకరించిందో పుస్తకంలో పేర్కొన్నారు.
చంద్రబాబు తో ఎన్టీఆర్ సావనీర్, లిటరేచర్, వెబ్ సైట్ కమిటీ సభ్యులు భేటీ
ఎన్టీఆర్ సావనీర్, లిటరేచర్, వెబ్ సైట్ కమిటీ సభ్యులు టీడీపీ అధినేత నారా
చంద్రబాబు నాయుడుతో ఆదివారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు.
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 20వ తేదీన ఎన్ టీ ఆర్ పై ప్రత్యేక
సంచికను, వెబ్ సైట్ ను ఆవిష్కరిస్తున్నారు. హైదరాబాద్ కే పీ హెచ్ బీ లోని
ఖైతలాపూర్ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కార్యక్రమ నిర్వహణపై
కమిటీ సభ్యులు చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యి చర్చించారు. ఈ సందర్భంగా
కమిటీ చైర్మన్ టి.డి జనార్థన్ కార్యక్రమ నిర్వహణను చంద్రబాబు నాయుడుకి
వివరించారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా కమిటీకి పలు సూచనలు
చేశారు.