హైదరాబాద్: నరేంద్ర మోడీ , అమిత్ షాలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్
పోరాడుతున్నారనేది పచ్చి అబద్ధమని, వారి మధ్య బలమైన బంధం ఉందని బీఎస్పీ
రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. అమిత్ షా ఆదేశాల
మేరకు గుజరాత్‌కు చెందిన అమూల్ పాల కంపెనీని రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు
కేటీఆర్ ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. అమూల్‌తో రాష్ట్ర పాడి రైతులకు
అన్యాయం జరుగుతుందని తెలిసినా కేసీఆర్ పట్టించుకోవట్లేదని తీవ్రంగా
తప్పుబట్టారు. ఈ క్రమంలోనే కిసాన్ సర్కార్ అంటే పాడి రైతుల పొట్ట కొట్టడమేనా
అని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి అమిత్ షాకు
వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాడుతున్నారనేది పచ్చి అబద్ధమని బీఎస్పీ
రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. వారి మధ్య బలమైన
బంధం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అమిత్ షా కేంద్రంలో సహకార మంత్రిత్వ
శాఖ మంత్రి కూడా అవుతారని ఎద్దేవా చేశారు. అమిత్ షా ఆదేశాల మేరకు గుజరాత్‌కు
చెందిన అమూల్ అనే పాల కంపెనీని తెలంగాణలో ఏర్పాటు చేయడానికి ఐటీ శాఖ మంత్రి
కేటీఆర్ ఆమోదం తెలిపారని, ఈ విషయం తలసాని వంటి మంత్రికి తెలియదని సెటైర్లతో
తీవ్రంగా విమర్శించారు. అమూల్ కంపెనీని కర్ణాటకలో ఏర్పాటు చేసి ఆ రాష్ట్రంలో
ఉన్న నందిని అనే పాల కంపెనీని మూసివేయాలని చూస్తే అక్కడి ప్రజలు తిరగబడ్డారని
ప్రవీణ్‌కుమార్ చెప్పారు. తెలంగాణలో మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత
నియోజకవర్గమైన గజ్వేల్‌లోని వర్గల్లో అమూల్ కంపెనీ ఏర్పాటు చేయడానికి ఎర్ర
తివాచీ పరిచి ఆహ్వానించారని విమర్శించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల
చేశారు. రాష్ట్ర పాడి రైతులకు అన్యాయం జరుగుతుందని తెలిసినా.. పట్టించుకోవడం
లేదని ప్రకటనలో తీవ్రంగా తప్పుబట్టారు.