హైదరాబాద్ : జూనియర్ పంచాయతీ సెక్రటరీ (జేపీఎస్)లను వెంటనే రెగ్యులరైజ్
చేయాలని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం
కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో గత 13 రోజులుగా పంచాయతీ
కార్యదర్శులు సమ్మెలో ఉండటంతో గ్రామాల్లో అభివృద్ధి ఆగిపోయిందని లేఖలో ఉత్తమ్
పేర్కొన్నారు. 2019 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు జేపీఎస్‌లు పనిచేసిన కాలాన్ని
సర్వీసుగా పరిగణించాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. మృతిచెందిన పంచాయతీ
కార్యదర్శుల స్థానంలో వారి కుటుంబసభ్యులకు అవకాశం కల్పించేలా కారుణ్య
నియామకాలు చేపట్టాలన్నారు. మహిళా పంచాయతీ కార్యదర్శులకు 6 నెలల పాటు ప్రసూతి
సెలవులు, 90 రోజుల చైల్డ్‌కేర్ సెలవులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఔట్
సోర్సింగ్ సెక్రటరీలను కూడా రెగ్యులరైజ్ చేయాలని ఉత్తమ్ కోరారు.

ఉత్తమ్‌తో ఆస్ట్రేలియా అంబాసిడర్ బృందం భేటీ : గాంధీ భవన్లో ఎంపీ ఉత్తమ్
కుమార్ రెడ్డితో ఆస్ట్రేలియా అంబాసిడర్ బృందం సమావేశమైంది. ఉత్తమ్‌తో పాటు
ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్
కుమార్ గౌడ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భేటీలో ఆస్ట్రేలియా హై
కమిషనర్ భేరి ఓ ఫెరల్, ఆస్ట్రేలియా కౌన్సిల్ జనరల్ సారా కిర్లె, జాక్ టేలర్
పొలిటికల్ సెక్రెటరీ ఉన్నారు. ఈ సందర్భంగా గాంధీ భవన్ నిర్మాణం అప్పటి శిలా
ఫలకాలను వారు పరిశీలించారు. అనంతరం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై
కాసేపు చర్చించారు.