హైదరాబాద్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్లో వచ్చే ఆదాయాన్ని రాష్ట్ర
ప్రభుత్వం దొంగిలిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇది
నియమ నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో పాల్గొన్న
అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘వర్షాకాలంలో కంటోన్మెంట్ పరిధిలో ప్రజలు
ఎదుర్కొనే ఇబ్బందులపై బోర్డు సమావేశంలో చర్చించాం. రోడ్లు, నాళాలు, సీవరేజ్
ప్లాంట్ ఏర్పాటుపై చర్చలు జరిపాం. మాజీ ఎంపీ నంది ఎల్లయ్య, మాజీ ఎమ్మెల్యే
సాయన్న విగ్రహాలను కంటోన్మెంట్ పరిధిలో ఏర్పాటు చేయాలని సూచించాం. దీనికి
సరైన స్థలాన్ని పరిశీలిస్తామని బోర్డు తెలిపింది. కంటోన్మెంట్‌కు రావాల్సిన
నిధులను రాష్ట్ర ప్రభుత్వం సరైన సమయంలో విడుదల చేయడం లేదు. దీంతో అభివృద్ధి
కుంటుపడుతోంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను విడుదల చేయాలి.
కంటోన్మెంట్ లో వచ్చిన ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దొంగిలిస్తోది. కేంద్రం
నుంచి కంటోన్మెంట్‌కు రావాల్సిన నిధులను తక్షణమే విడుదల చేసేలా కేంద్రమంత్రి
కిషన్‌రెడ్డి చొరవ చూపాలని రేవంత్ కోరారు.